మొటిమలు అనేవి సాధారణమైన చర్మ సమస్యే అయినా, మహిళల్లో ఇది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉంటుంది. ముఖంపై వచ్చే మొటిమలు అందాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ సమస్య వెనుక హార్మోన్ల అసమతుల్యత, ఆహారపు అలవాట్లు, స్కిన్‌కేర్ మార్జిన్, ఒత్తిడి వంటి అనేక కారణాలు ఉంటాయి.

1. PCOS ప్రభావం:
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) వల్ల ఆండ్రోజెన్ హార్మోన్ పెరిగి చర్మంలో ఆయిల్ ఉత్పత్తి పెరిగి మొటిమలు వస్తాయి.
2. మెనోపాజ్ సమయంలో హార్మోన్ల మార్పులు:
ఎస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ లో మార్పులు చర్మాన్ని పొడిగా మార్చి సెబమ్ ఉత్పత్తి పెరగడానికి దారి తీస్తాయి.
3. నెలసరి సమయంలో మొటిమలు:
పీరియడ్ సమయం లో హార్మోన్ల ఉత్పత్తిలో వచ్చే మార్పుల వల్ల కూడా మొటిమలు వస్తాయి.
4. మానసిక ఒత్తిడి:
ఒత్తిడి వల్ల కార్టిసోల్ పెరిగి చర్మం ఆయిలీగా మారి మొటిమలు ఎక్కువవుతాయి.
5. సంతాన నియంత్రణ మాత్రలు:
హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తూ మొటిమలకు అవకాశం ఇస్తాయి.

6. తప్పు స్కిన్ కేర్ ఉత్పత్తులు:
చర్మానికి సరిపోని క్రీములు, మేకప్ తీసేయకపోవడం వల్ల చర్మం దెబ్బతిని మొటిమలు వస్తాయి.
7. ఆహారపు అలవాట్లు:
చక్కెర, కొవ్వు, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ పెరిగి మొటిమలు ఏర్పడతాయి.
8. వారసత్వ ప్రభావం:
కుటుంబంలో ఇతరులకు మొటిమల ఇబ్బంది ఉంటే మీకు కూడా వచ్చే అవకాశం ఉంది.
9. పర్యావరణ కాలుష్యం:
దుమ్ము, ధూళి వంటివి చర్మాన్ని ప్రభావితం చేసి మొటిమలకు దారి తీస్తాయి.
ఈ కారణాలను గుర్తించి, సరైన జీవనశైలి, చర్మ సంరక్షణ అలవాట్లు వేసుకుంటే మొటిమల సమస్యను తగ్గించుకోవచ్చు.