• Home
  • Entertainment
  • రామ్ చరణ్ ‘పెద్ది’ క్రికెట్ షాట్‌ను రీ-క్రియేట్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ – వీడియో వైరల్!
Image

రామ్ చరణ్ ‘పెద్ది’ క్రికెట్ షాట్‌ను రీ-క్రియేట్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ – వీడియో వైరల్!

గేమ్ ఛేంజర్ సినిమాతో విమర్శలను ఎదుర్కొన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమాతో మళ్ళీ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ టీజర్‌లో చరణ్ మాస్ అవతారంలో క్రికెట్ ఆడుతున్న సీన్ ఒక్కసారిగా హైలైట్ అయింది. చరణ్‌ సిగ్నేచర్‌ సిక్స్‌ షాట్ టీజర్‌ హైలైట్‌గా నిలిచింది.

అయితే ఇదే సీన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ టీం ప్రత్యేకంగా రీ-క్రియేట్ చేసింది. ఐపీఎల్ 2025 సీజన్‌లో SRH vs DC మ్యాచ్‌కు ముందు రిలీజ్ చేసిన ఈ వీడియోలో ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్ ప్లేయర్ సమీర్ రజ్వీ, చరణ్‌ స్టైల్‌లో బ్యాట్ ఉంచి ఒక మాస్ సిక్స్ కొడతాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ పేజీకి అభిమానుల నుంచి భారీ స్పందన వస్తోంది. ‘పెద్ది’ సినిమా క్రేజ్‌ను హైలైట్ చేస్తూ ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈ ప్రోమోషనల్ వీడియో రిలీజ్ చేయడం విశేషం.

ఈ వీడియోపై రామ్ చరణ్ స్పందిస్తూ – “ధన్యవాదాలు ఢిల్లీ క్యాపిటల్స్. మీ క్రియేటివిటీకి హ్యాట్సాఫ్!” అంటూ తన అధికారిక సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు. దీని వల్ల ‘పెద్ది’ సినిమా క్రేజ్ మరింత పెరిగింది. ఇక ఈ రోజు జరగబోయే SRH vs DC మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. హైదరాబాద్ 9వ స్థానంలో ఉండగా, ఢిల్లీకి ప్లేఆఫ్ ఆశల కోసం ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాల్సిన అవసరం ఉంది.

https://www.instagram.com/reel/DJQ-Z35vG9O/?utm_source=ig_web_copy_link

Releated Posts

విరాట్ కోహ్లి టెస్టులకు గుడ్‌బై – అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటన…

న్యూఢిల్లీ: భారత క్రికెట్ అభిమానులకు ఓ ఆవేదన కలిగించే వార్త. టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు.…

ByByVedika TeamMay 12, 2025

ఈడీ నోటీసులు.. మహేష్ బాబు విచారణకు హాజరవుతారా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్,…

ByByVedika TeamMay 12, 2025

విజయ్ కుమారుడు.. అఖిల్‌తో కలిసిన ఫోటో వైరల్! భారీ ప్రాజెక్ట్‌పై ఊహాగానాలు…!!

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే…

ByByVedika TeamMay 10, 2025

సమంత “న్యూ బిగినింగ్స్” ఫొటోల వెనుక రహస్యం: రాజ్‌ నిడిమోరుతో సంబంధం?

సమంత ఇటీవల “న్యూ బిగినింగ్స్” అనే క్యాప్షన్‌తో పలు ఫొటోలు షేర్ చేయగా, అందులో దర్శకుడు రాజ్‌ నిడిమోరు కనిపించడంతో నెటిజన్ల దృష్టి అక్కడికి…

ByByVedika TeamMay 9, 2025

ఐపీఎల్ 2025కి బ్రేక్: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య BCCI కీలక నిర్ణయం…

భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఐపీఎల్ 2025పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్…

ByByVedika TeamMay 9, 2025

రజనీకాంత్ ‘కూలీ’ పారితోషికం షాకింగ్: 260 కోట్లు రెమ్యునరేషన్.. నాగార్జున, ఆమిర్ ఖాన్‌కి ఎంతంటే?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న ‘కూలీ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ డైరెక్టర్…

ByByVedika TeamMay 8, 2025

నాని స్పష్టం: మళ్లీ బిగ్ బాస్‌కు హోస్ట్‌గా రావడం జరగదు!ఎందుకు అంటే..!!

తెలుగులో బిగ్ బాస్ అనే రియాల్టీ షోకు దేశవ్యాప్తంగా అభిమానులుండగా, ఈ షోను తొలి సీజన్‌లో ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, రెండో సీజన్‌లో న్యాచురల్…

ByByVedika TeamMay 7, 2025

మెగా ఫ్యామిలీలో కొత్త అధ్యాయం: తల్లిదండ్రులు కాబోతున్న…!!

మెగా ఫ్యామిలీలో మధురక్షణాలు నెలకొన్నాయి. టాలీవుడ్ జంట వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి తమ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతోందని అధికారికంగా ప్రకటించారు.…

ByByVedika TeamMay 6, 2025

బాలీవుడ్ ఓ ఫేక్ ఇండస్ట్రీ..! బాబిల్ ఖాన్ ఎమోషనల్‌ అవుట్‌బర్స్ట్‌పై వైరల్ చర్చ!

బాలీవుడ్ ఓ ఫేక్ ఇండస్ట్రీగా అభివర్ణిస్తూ నటుడు బాబిల్ ఖాన్ పెట్టిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నటుడు ఇర్ఫాన్ ఖాన్…

ByByVedika TeamMay 5, 2025

Leave a Reply