నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాను జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా కాలికి గాయం కావడంతో సినిమా షూటింగులకు తాత్కాలిక విరామం తీసుకుంది. ఇటీవల పుష్ప 2 చిత్రంతో సంచలన విజయాన్ని సాధించిన రష్మిక, ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో కలిసి సికందర్ చిత్రంలో నటిస్తోంది. ఈ గాయం కారణంగా రష్మిక తన న్యూ ఇయర్‌ను నొప్పితో ప్రారంభించిందని తెలిపింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో తన కుడి పాదంపై కట్టు వేసిన ఫోటోను పంచుకుంటూ, “న్యూ ఇయర్ నొప్పితో మొదలైంది. ఆశతో రికవరీ కోసం ఎదురు చూస్తున్నాను,” అని రాసింది. ప్రస్తుతం థమ, సికందర్, కుబేర షూటింగ్‌లకు తిరిగి రావాలని
కోరుకుంటోంది. సికందర్ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించగా, సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ద్విపాత్రాభినయం చేయగా, కాజల్ అగర్వాల్, సత్యరాజ్, శర్మన్ జోషి, రష్మిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి నెలలో ఈ చిత్రం విడుదల కానుంది.