కోలీవుడ్ స్టార్ హీరోలు ఒకరికొకరు సన్నిహితంగా ఉన్నా, వారి అభిమానులు మాత్రం తరచూ సోషల్ మీడియా వేదికగా వాదనకు దిగుతుంటారు. తాజాగా రజనీకాంత్ అభిమాని అని చెప్పుకున్న ఓ వ్యక్తి దళపతి విజయ్ గురించి నెగటివ్‌గా వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.

ఈ విషయం రజనీకాంత్ దృష్టికి వెళ్లడంతో ఆయన బృందం వెంటనే స్పందించింది. “ఇతర హీరోలను దూషించే అభిమానులకు హెచ్చరిక. నిజమైన రజనీకాంత్ అభిమానులు ఎవరిపైనా ద్వేషాన్ని ప్రదర్శించరు. సినిమా అనేది ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడానికి. మనం ప్రేమతో, గౌరవంతో మా అభిమానాన్ని వ్యక్తపరచాలి. ద్వేషంతో కాదు” అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.
రజనీకాంత్ ప్రస్తుతం ‘కూలీ’ సినిమాతో బిజీగా ఉన్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తర్వాత ‘జైలర్ 2’ చేయనున్నారు. మరోవైపు విజయ్ దళపతి ‘జన నాయగన్’ సినిమా చేస్తున్నారు. ఇది అతని చివరి సినిమా అవుతుందనే ప్రచారం ఉంది. ఇప్పటికే రాజకీయ పార్టీని స్థాపించిన విజయ్, వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.