కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న ‘కూలీ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్, అక్కినేని నాగార్జున, శ్రుతి హాసన్, కన్నడ స్టార్ ఉపేంద్ర, సీనియర్ నటుడు సత్యరాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.400 కోట్లు.

ఈ సినిమాలో రజనీకాంత్ తన కెరీర్‌లోనే అత్యధికంగా రూ.260 కోట్ల పారితోషికం తీసుకున్నారని సమాచారం. ఇది కేజీఎఫ్ వంటి మూడు సినిమాల బడ్జెట్‌కి సమానం. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ 60 కోట్లు, నాగార్జున 24 కోట్లు, ఆమిర్ ఖాన్ 30 కోట్లు, పూజా హెగ్డే ఓ స్పెషల్ సాంగ్ కోసం 2 కోట్లు అందుకున్నట్లు టాక్ ఉంది. రజనీకాంత్ వయసు 72 ఏళ్లు అయినా, ఇప్పటికీ భారీ క్రేజ్‌ను కొనసాగిస్తున్నారనడానికి ఇది నిదర్శనం.
ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భారీ తారాగణం, భారీ బడ్జెట్, థ్రిల్లింగ్ కథనంతో ‘కూలీ’ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు పెంచింది.