• Home
  • Entertainment
  • రాజ్ తరుణ్-లావణ్య మధ్య మరోసారి వివాదం: కోకాపేట్ ఇంటి విషయంలో హైడ్రామా, పోలీస్ ఫిర్యాదు..??
Image

రాజ్ తరుణ్-లావణ్య మధ్య మరోసారి వివాదం: కోకాపేట్ ఇంటి విషయంలో హైడ్రామా, పోలీస్ ఫిర్యాదు..??

అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్న రాజ్‌ తరుణ్, లావణ్య మధ్య వివాదం మళ్లీ కొత్త మలుపు తిరిగింది. ఇటీవల నార్సింగి పోలీస్ స్టేషన్‌ లో లావణ్య ఫిర్యాదు చేశారు. రాజ్‌ తరుణ్‌ తల్లిదండ్రులకు చెందిన వ్యక్తులు తనపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించి రక్షణ కోరారు. మరోవైపు రాజ్‌ తరుణ్‌ తల్లిదండ్రులు లావణ్య ప్రస్తుతం నివసిస్తున్న కోకాపేట్ ఇంటి వద్ద అర్ధరాత్రివరకు నిరసన చేపట్టారు.

ఆ ఇల్లు తమ కుమారుడిదని వాదిస్తూ, ఇంట్లోకి అనుమతించాలని నార్సింగి పోలీసుల సాయంతో ప్రయత్నించారు. దీంతో లావణ్య పోలీసులు చెప్పినట్లుగా ఇంట్లోకి అనుమతించారు. అయితే రాజ్ తరుణ్ పేరెంట్స్‌ ఇంట్లోకి ప్రవేశించగానే వాగ్వాదం మొదలైంది. లావణ్య ఆధారంగా పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం, రాజ్ తరుణ్ తల్లిదండ్రులు పదిహేను మందితో కలిసి ఇంటికి వచ్చి, దాడికి పాల్పడ్డారని, తమ్ముడిపై బ్యాట్‌తో దాడి చేశారని ఆరోపించారు.

ఒకానొక సమయంలో రాజ్‌తరుణ్‌ తనను మోసం చేశాడని లావణ్య ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో వివాదం పెద్దదై, ఆమె కేసులు పెట్టగా, కొంతకాలానికి ఆమె క్షమాపణ చెప్పి వాటిని వెనక్కి తీసుకుంది. అందరూ వివాదానికి ముగింపు పలికారని భావించిన సమయంలో ఈ ఘటన మళ్లీ బయటకు వచ్చింది.

Releated Posts

మహేష్ బాబు చేయాల్సిన సినిమా దక్కించుకున్న రామ్ చరణ్…!!

సినీ పరిశ్రమలో ఒక కథ మరో హీరోకి వెళ్ళడం సాధారణమే. కానీ కొన్నిసార్లు అది ఒకరి కెరీర్‌ను మలుపు తిప్పే విధంగా మారిపోతుంది. అలాంటి…

ByByVedika TeamApr 19, 2025

షైన్ టామ్ చాకో అరెస్ట్ – డ్రగ్ కేసులో కీలక మలుపు..!!

ప్రముఖ నటుడు మరియు ‘దసరా’ విలన్‌ షైన్ టామ్ చాకో ఇటీవల వార్తల్లో హాట్ టాపిక్ అయ్యారు. రెండు రోజులుగా హోటల్ నుంచి తప్పించుకుని…

ByByVedika TeamApr 19, 2025

కేఎల్ రాహుల్ కుమార్తెకు నామకరణం: “ఇవారా” అర్థం ఏమిటి?

భారత క్రికెట్ స్టార్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి గత ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మార్చి 24న వీరిద్దరికీ ఓ…

ByByVedika TeamApr 18, 2025

మ్యాడ్ స్క్వేర్ థియేటర్ హిట్‌ తర్వాత ఓటీటీలోకి..??

చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సాధించిన సినిమాల్లో మ్యాడ్ ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. దర్శకుడు కళ్యాణ్ శంకర్ రూపొందించిన ఈ యువతరానికి…

ByByVedika TeamApr 18, 2025

Leave a Reply