ఈ సంవత్సరంలో ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో పుష్ప 2 ఒకటి. 2022 డిసెంబర్ లో విడుదల అయిన పుష్య 1 సినిమా సౌత్ ఇండియా లో కంటే నార్త్ ఇండియాలో ఎక్కువ ఆడింది. ముఖ్యంగా ఈ సినిమాలో పాటలను నార్త్ ఇండియన్ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బన్నీ మ్యానరిజంను ఇమిటెడ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సుకుమార్ టేకింగ్ కి అల్లు అర్జున్ ఆటిట్యూడ్ తోడు అవ్వడంతో బాక్స్ ఆఫీసు బద్దలు అయింది. నార్త్ ఇండియన్ ప్రేక్షకులు కరోనా టైమ్లో రొటీన్ సినిమాలు చూసి బోర్ ఫీల్ అయ్యారు. సరిగ్గా అదే టైమ్ లో పుష్ప సినిమా విడుదల అయింది. మొదటి వారం వరకు జనాలు పెద్దగా లేరు. కానీ ఎపుడైతే మౌత్ టాక్ స్ప్రెడ్ అయిందో అప్పటి నుంచి బాక్స్ ఆఫీసు ను దున్నేసింది అని చెప్పాలి. Pushpa 2 Movie Latest Updates
మరో బాహుబలి అవుతుందా ?
బాహుబలి 1 సినిమా కూడ నార్త్ ప్రేక్షకులను బాగా ఎక్కేసింది. కట్టప్ప బాహుబలిను ఎందుకు చంపారు అనే పాయింట్ తో ప్రేక్షకులను లాక్ చేశారు. దీంతో బాహుబలి 2 సినిమా కోసం ఇండియన్ వైడ్ గా ఫాన్స్ చాలా ఆతృతగా ఎదురు చూశారు. దీనికి తోడు బాహుబలి 2 విజువల్ కూడ చాల గ్రాండియర్ గా ఉండటంతో బాక్స్ ఆఫీసు తల వంచక తప్పలేదు. విడుదల అయిన అన్నీ భాషాలలో రికార్డులు బ్రేక్ చేసింది. తమిళనాడులో అయితే రజినీకాంత్, విజయ్ సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది. కేరళలో కూడ అన్నీ రికార్డులను బ్రేక్ చేసింది. నార్త్ ఇండియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక పుష్ప విషయానికి వస్తే ఈ అప్పటి పరిస్థితుల వలన సూపర్ హిట్ అయింది. దీంతో సెకండ్ పార్ట్ పై భారీ హైప్ వచ్చింది. కానీ బాహుబలి కి ఉన్నంత హైప్ ఉందా అంటే చెప్పలేని పరిస్థితి. కానీ అల్లు అర్జున్ ఆటిట్యూడ్ కోసం అయితే చాల ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై నార్త్ ఇండియా లో చాల క్రేజ్ ఉంది. కానీ సౌత్ ఇండియాలో తెలుగులో క్రేజ్ మాత్రం ఆకాశాన్ని తాకుంది. ఇక మిగిలిన తమిళం, మలయాళంలో అయితే చెప్పలేని పరిస్థితి వచ్చింది. దీంతో తెలుగు, హిందీ తప్ప మిగతా భాషలలొ మాత్రం ఈ సినిమా టాక్ పైనే ఆధారపడి ఉంటుంది.
బాహుబలి సినిమా సూపర్ హిట్ అవ్వడానికి మరో కారణం రాజమౌళి అనుసరించిన ప్రమోషన్ స్ట్రాటజి. రాజమౌళి కేవలం దర్శకుడిగా మాత్రమే కాకుండా ప్రమోషన్ మొత్తాన్ని తన భుజాలపై వేసుకుంటాడు. బాహుబలి ముందు వరకు తెలుగు మార్కెట్ అటు ఇటు 70 నుంచి 80 కోట్ల వరకు మాత్రమే ఉండేది. కానీ బాహుబలి సూపర్ హిట్ అవ్వడంతో పాన్ ఇండియన్ సినిమాలు వరుసగా వచ్చాయి. పుష్ప1 కి సంబంధించి ప్రమోషన్ అంతగ చేయలేదు. సుకుమార్ చివరి నిమిషం వరకు ఎడిటింగ్ రూమ్ లోనే ఉన్నారు. ఇప్పుడు పార్ట్ 2 సినిమాకి కూడ దాదాపు ఎడిటింగ్ రూమ్ లోనే ఉండే అవకాశం ఉంది. దీంతో ప్రమోషన్ భారం మొత్తాన్ని అల్లు అర్జున్ మోయనున్నారు. మొత్తానికి పుష్ప సినిమాకి ఒక బ్రాండ్ అయితే క్రియేట్ అయింది. కానీ బాహుబలి రేంజ్లో వసూళ్లు వస్తాయా లేదా బాహుబలిని బీట్ చేస్తుందా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఏది ఏమైనా మరో 25 రోజుల్లో రానున్న పుష్ప2 సినిమా భారీ హిట్ అయి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలని కోరుకుందాం..