స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా అయిన పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ ఫాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. గతంలో బాహుబలి 2 మరియు కెజిఫ్ 2 కోసం ఎంత ఎదురు చూసారో అదే రేంజ్ లో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఒక విషయంలో మాత్రం పుష్ప టీం బాగా భయపడుతుంది. అదే కనుక జరిగితే పుష్ప 2 సినిమాకి భారీ దెబ్బ అనుకోవచ్చు. అసలు పుష్ప 2 సినిమా వెనుకాల ఎం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం….
సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. మొదటి పార్ట్ మన దగ్గర కంటే నార్త్ లో బాగా హిట్ ఐంది. ఈ సినిమా నిర్మాతలు రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి పుష్ప 2 సినిమా రిలీజ్ డేట్ పై అప్డేట్ ఇచ్చారు. అనుకున్న దాని కంటే ఒక రోజు ముందే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 5న విడుదల చేస్తున్నాము అని ప్రకటించారు. ఇంత వరకు బాగానే ఉంది కానీ ఆ ప్రెస్ మీట్ లో నిర్మాతలు కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ తో ఉన్నట్టు మాట్లాడారు. పుష్ప 2 మొదటి రోజు అన్ని రికార్డులు బ్రేక్ చేసి సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని చెప్పారు. దింతో సొషల్ మీడియాలో ట్రోల్స్ మొదలు పెట్టారు నెటిజన్లు. సినిమాపై కాన్ఫిడెంట్ ఉండవచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెంట్ ఉండకూడదు అని అంటున్నారు. ఓక వేళ సినిమా హిట్ అయితే ఒకే కానీ నెగిటివ్ టాక్ వస్తే మాత్రం నెటిజన్లు ఆడుకుంటారు. ప్రమోషన్ స్ట్రాటజీ మొత్తం రాజమౌళిని చూసి నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు నెటిజన్లు. రాజమౌళి తీసే ప్రతి సినిమాపై ఓవర్ గా రియాక్ట్ అవ్వరు. ఫస్ట్ డే ఇంత, సెకండ్ డే ఇంత వస్తుందని ముందే ఉహించి చెప్పారు. సినిమాపై ఎంత ఎఫర్ట్ పెట్టాము, ఏ విధంగా తీసాము అనే విషయాలు మాత్రమే చెబుతారు.
పుష్ప 2 సినిమాపై హిందీ మార్కెట్ లో భారీ హైప్ ఉన్న మాట వాస్తవమే. కానీ దానికి అనుగుణంగా సినిమా ఉంటె మాత్రం కలెక్షన్ల మోత మోగిపోవడం ఖాయం. పుష్ప టీం భయపడే మరో కారణం పవన్ కళ్యాణ్ ఫాన్స్. రీసెంట్ గా ఆంధ్ర లో జరిగిన ఎన్నికల్లో పరోక్షకంగా బన్నీ వైసీపీ ఏమ్మెల్యే కి సపోర్ట్ చేశారు అని జనసేన నాయకులు విమర్శలు చేశారు. దింతో అటు పవర్ స్టార్ ఫాన్స్ మరియు అల్లు అర్జున్ ఫాన్స్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ వైరం ఇప్పటిది కాదు ఒకప్పుడు అల్లు అర్జున్ చెప్పిన చెప్పను బ్రదర్ అనే డైలాగ్ నుంచి ఈ వార్ మొదలు ఐంది. ఆ తరువాత వచ్చిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ప్లాప్ కావడానికి కారణం వీళ్ళే అంటూ అల్లు అరవింద్ చెప్పారు. ఆ తరువాత ఈ గొడవ ముగిసిన మళ్ళి ఇప్పుడు మొదలు అయింది. ఈ సారి ఎం జరుగుతుందో చూడాలి. ఒక వేళ సినిమా ప్లాప్ అయితే అల్లు అర్జున్ కి ఎం కాదు, ప్రొడ్యూసర్ కి ఎం కాదు కానీ నష్టపోయేది మాత్రం డిస్ట్రిబ్యూటర్స్, ఎక్సీబ్యూటర్స్. దింతో ఈ సినిమాను ఆంధ్ర లో కొనాలంటే కొంత మదిని భయపడుతున్నారు అని వార్తలు వస్తున్నాయి.
మరికొంత మంది అత్యుత్సాహంగా ఈ సినిమా 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు పోస్టులు పెడుతున్నారు. అప్పుడు బ్రేక్ ఈవెన్ కావాలంటే 2500 కోట్లు వసూలు చేయాలి. ఇది సాధ్యం కానీ పని. Rrr, కెజిఫ్ వంటి సినిమాలే 450 కోట్ల లోపు బిజినెస్ చేశాయి. 1800 కోట్ల వసూలు చేసిన బాహుబలి 2 ప్రీ రిలీజ్ బిసినెస్ 350 కోట్లు. మొత్తానికి పుష్ప 2 అనే సినిమాపై భారీ హైప్ ఉంది. ఇదే హైప్ తో కలెక్షన్స్ కొల్లగొడుతుందో ? లేదా చతికిలపడుతుందో ఈ సినిమా విడుదల అయ్యే వరకు ఎదురు చూడాలి.