డేరింగ్ అండ్ డాషింగ్ అని పిలవబడే పూరి జగన్నాధ్ గత కొంత కాలంగా హిట్స్ లేక సతమతమవుతున్నారు. టెంపర్, ఇస్మార్ట్ శంకర్ సినిమాలు మాత్రమే ఈ 10 సంవత్సరాల కాలంలో హిట్ అయినవి. ఆ తరువాత వచ్చిన అన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి. లైగర్ సినిమా అయితే పూరి ఇమేజ్ ను చాలా డ్యామేజ్ చేసింది. ఆ తరువాత వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమా పరిస్థితి కూడ సేమ్ తో సేమ్. అయిన సరే పూరి జగన్నాధ్ నుంచి సినిమా వస్తుంది అంటే ఒక ఇమేజ్ తయారవుతుంది. అయితే డబుల్ ఇస్మార్ట్ సినిమా తరువాత చాల మంది హీరోల పేర్లు బయటికి వచ్చాయి. బాలకృష్ణ, రాజశేఖర్, నితిన్ ల పేర్లు వినపడ్డాయి. కానీ చివరికి అయ్యాగారు దొరికారు.
నిజానికి అక్కినేని అఖిల్ కి కూడ హిట్స్ లేవు. అఖిల్ ప్లేస్ లో మరో హీరో ఉండి ఉంటె ఫేడ్ అవుట్ అయ్యేవారు. ఇప్పటి వరకు చేసిన సినిమాలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తప్ప ఇంకో హిట్ సినిమా లేదు. ఈ సినిమా కూడ హీరోయిన్ పూజ హెగ్డే ఖాతాలోకి వెళ్లిపోయింది. అఖిల్ గత సినిమా ఏజెంట్ అట్టర్ ప్లాప్ అయింది. ఈ సినిమా తరువాత యూవీ క్రియేషన్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అయితే జరుగుతుంది కానీ ఒక్క అప్డేట్ కూడ బయటికి రావడం లేదు. ఈ సినిమా కూడ చివరి స్టేజి కి వచ్చింది. ఈ సినిమా తరువాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటించే అవకాశాలు ఉన్నాయి అంటు ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇద్దరు ప్లాప్ ఉన్నారు కావున మరింత కసిగా పని చేసి సూపర్ హిట్ కొట్టాలని అఖిల్ అభిమానులు మరోవైపు పూరి జగన్నాధ్ అభిమానులు కోరుతున్నారు