బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తాజాగా కొన్ని రోజుల క్రితం లాస్ ఏంజెలెస్ నుంచి హైదరాబాద్ కు వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB29 సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యిందనే వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే, ఆ వార్తల్లో ఎంతవరకు నిజముందో ఇంకా స్పష్టత లేదు.

ప్రస్తుతం ప్రియాంక చోప్రా హైదరాబాద్ లో చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించిన ఫోటోలు మరియు మహా కుంభమేళాలో ఆమె కుటుంబంతో పాల్గొన్నట్లు చెప్పిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే కుంభమేళా ఫోటోల వెనుక అసలు నిజం ఏంటంటే, ఈ ఫోటోలు నిజానికి అయోధ్యలో రామమందిరాన్ని సందర్శించినప్పుడు తీసినవి. కొందరు ఎడిట్ చేసి కుంభమేళాలో దిగినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అమెరికాలో సెటిల్ అయ్యి, తన భర్త నిక్ జోనాస్, కుమార్తె మాల్తీతో కలిసి జీవనం సాగిస్తోంది. SSMB29 సినిమాలో ఆమె నిజంగానే హీరోయిన్‌గా ఉండబోతుందా అనే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.