• Home
  • Movie
  • బాల‌య్య‌తో చేయ‌డం ఆనందంగా ఉంది
Image

బాల‌య్య‌తో చేయ‌డం ఆనందంగా ఉంది

డాకూ మ‌హారాజ్ హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్యూలో ప‌లు విష‌యాలు తెలిపారు. వాటిలో ముఖ్యాంశాలు

  1. బాలకృష్ణతో వరుస సినిమాలు:
    ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ, “బాలకృష్ణ గారితో వరుసగా సినిమా చేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. అఖండ చిత్రంలో నటించాను. అది నా కెరీర్‌కు మంచి మలుపు ఇచ్చింది.”
  2. డాకు మహారాజ్:
    “ఈ చిత్రంలో నేను కావేరి పాత్రను పోషిస్తున్నాను. ఈ పాత్రను పోషించడం సవాల్‌గా భావిస్తున్నాను. బాలకృష్ణ గారు, ఈ సినిమాలో చాలా కొత్త‌గా క‌నిపిస్తారు.
  3. దర్శకుడు బాబీ కొల్లి:
    “బాబీ గారు అద్భుతమైన దర్శకుడు. ఆయన డైరెక్షన్‌లో నటించేందుకు అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. సెట్స్‌లో ఆయన మనస్తత్వం, నటీనటులను ఒత్తిడికి గురి చేయకుండా ఆయ‌న స్టేజి నిర్వహించడం నాకు చాలా నచ్చింది.”
  4. బాలకృష్ణ గారితో అనుభవం:
    “బాలకృష్ణ గారు ఎంతో అనుభవం ఉన్న నటుడు. ఆయన ఇంకా కొత్త విషయాలను నేర్చుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారు.”
  5. తమన్ సంగీతం:
    “తమన్ గారు ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు. ‘డాకు మహారాజ్’ చిత్రం కోసం రూపొందించిన పాటలు నాకు చాలా నచ్చాయి.”
  6. జనవరి 12 విడుదల:
    నా పుట్టినరోజు నాడు విడుద‌ల‌వున్న ఈ సినిమాకు నాకు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఇది నా పుట్టినరోజుకి ఒక గొప్ప బహుమతి అనుకుంటున్నాను.”
  7. డ్రీం రోల్:

“నా డ్రీం రోల్‌కు సంబంధించిన విషయానికి వస్తే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేయాలనుకుంటున్నాను. ప్రగ్యా జైస్వాల్ బాలకృష్ణతో జ‌త‌క‌ట్టిన డాకూ మ‌హారాజ్‌ సంక్రాంతి కానుకగా విడుదల అవుతోంది.

Releated Posts

ఈడీ నోటీసులు.. మహేష్ బాబు విచారణకు హాజరవుతారా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్,…

ByByVedika TeamMay 12, 2025

విజయ్ కుమారుడు.. అఖిల్‌తో కలిసిన ఫోటో వైరల్! భారీ ప్రాజెక్ట్‌పై ఊహాగానాలు…!!

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే…

ByByVedika TeamMay 10, 2025

సమంత “న్యూ బిగినింగ్స్” ఫొటోల వెనుక రహస్యం: రాజ్‌ నిడిమోరుతో సంబంధం?

సమంత ఇటీవల “న్యూ బిగినింగ్స్” అనే క్యాప్షన్‌తో పలు ఫొటోలు షేర్ చేయగా, అందులో దర్శకుడు రాజ్‌ నిడిమోరు కనిపించడంతో నెటిజన్ల దృష్టి అక్కడికి…

ByByVedika TeamMay 9, 2025

రజనీకాంత్ ‘కూలీ’ పారితోషికం షాకింగ్: 260 కోట్లు రెమ్యునరేషన్.. నాగార్జున, ఆమిర్ ఖాన్‌కి ఎంతంటే?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న ‘కూలీ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ డైరెక్టర్…

ByByVedika TeamMay 8, 2025

Leave a Reply