వరుస ప్లాప్ లతో ఢీలా పడ్డ ప్రభాస్ ఫాన్స్ కు కొంచెం బూస్ట్ ఇచ్చిన సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హోంబాలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరందగుర్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. 2023 డిసెంబర్ క్రిస్మస్ సందర్బంగా విడుదల అయిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులను మెప్పించింది. ప్రభాస్ అభిమానులకు ఈ సినిమా మాస్ విజువల్ ఫస్ట్ లాంటిది. ప్రభాస్ గత సినిమాల కంటే కొంచెం బెటర్ అనే టాక్ వచ్చింది. కానీ కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. చాల సంవత్సరాలుగా ఆకలితో ఉన్న ప్రభాస్ అభిమానులకు దాహార్తిని తీర్చింది. కానీ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రెండు పార్టులుగా తీయాలని నిర్ణయించుకున్నారు. మొదటి పార్ట్ చివర్లో ఖాన్సార్ లో గతంలో జరిగిన దానిపై చిన్న క్లూస్ ఇచ్చి మొదటి పార్ట్ ను ముగించారు. Prabhas Upcoming Movies
అయితే ఈ సినిమా కూడ కెజిఫ్ ఫార్మట్ లో రొటీన్ గా ఉండనే వాదన కూడ ఉంది. కలెక్షన్స్ అయితే బాగానే వచ్చాయి కానీ మూవీ టీంవారు అంచనా వేసిన విధంగా రాలేదు అని సమాచారం దింతో సలార్ 2 ఉంటుందా ? లేదా ? అనే డైలమా లో పడ్డారు ఫాన్స్. దీనికి తోడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా కమిట్ అవ్వడంతో సలార్ 2 ఉండదని అందరు భావించారు. కానీ కల్కి సినిమా సూపర్ హిట్ అయి 1000 కోట్ల క్లబ్ లో చేరడంతో మళ్ళి సలార్ 2 టీంలో కదలిక మొదలు అయింది. హోంబాలే ఫిలిమ్స్ వారు ప్రభాస్ తో తమ రాబోయే సినిమాలను ప్రకటించారు. 2026, 2027, 2028 సంవత్సరాల్లో ప్రభాస్ తో సినిమాలు ఉంటాయి అని ట్విట్టర్ లో అప్డేట్ ఇచ్చారు, ఇందులో మొదటిది సలార్ 2 సినిమా రానుంది. ప్రెసెంట్ ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో షూటింగ్ మొదలు కాబోతుంది.
ఈ సినిమా తరువాత కెజిఫ్ 3 లో నటించనున్నారు. ఇప్పటికే కెజిఫ్ 3 స్క్రిప్ట్ వర్క్ కూడ మొదలు ఐంది. కెజిఫ్ 3 లో యాష్ తో కలిసి ప్రభాస్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఆ తరువాత తెలుగు దర్శకుడుతో మరో సినిమా ఉంటుంది. ఈ మేరకు అగ్రిమెంట్ కూడ అయిపోయిందని ఫిలిం నగర్ సమాచారం. ఈ లెక్కన చుస్తే ప్రభాస్ కాల్ షీట్ వచ్చే 5 సంవత్సరాల వరకు ఖాళీగా లేవు. ప్రభాస్ అభిమానులకు అయితే ప్రతి సంవత్సరం ఒకటి లేదా రెండు సినిమాలతో ఫుల్ ఎంజాయ్ చేయబోతున్నారు.