రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ నుండి సౌత్ వరకూ, విదేశాల్లోనూ ఆయనకున్న ఫాలోయింగ్ ఎంతో గొప్పది. ‘బాహుబలి’తో గ్లోబల్ స్టార్‌గా మారిన ప్రభాస్, ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ఫ్లాప్ అయినా… ఇటీవలే ‘సలార్’, ‘కల్కి 2898 ఏడి’ చిత్రాలతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. సలార్ సినిమాతో దాదాపు ఆరేళ్ల తర్వాత సాలిడ్ హిట్ అందుకున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో వరుసగా భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. మొదటిగా హారర్ నేపథ్యంలో రూపొందుతున్న రాజా సాబ్ సినిమాలో డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే భారీ ప్రాజెక్టులో ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.
ఇవే కాకుండా ‘సలార్ 2’, ‘కల్కి 2’, మరియు హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్‌లోనూ నటిస్తున్నారు. ఇలా వరుసగా సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ, తాజాగా ఒక ఎమోషనల్ వీడియోలో కనిపించారు ప్రభాస్. అందులో ఆయన తన మొదటి సినిమా ఈశ్వర్ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తే డార్లింగ్‌కు సినిమా పట్ల ఉండే ప్యాషన్ ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది.