పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డ్రగ్స్ వ్యతిరేక పోరాటానికి తన వంతు బాధ్యతగా ఓ ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ప్రభాస్ సందేశం:
“మన జీవితంలో కావాల్సినంత ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి. మనల్ని ప్రేమించే మనుషులు ఉన్నప్పుడు డ్రగ్స్ ఎందుకు? డ్రగ్స్‌కు నో చెప్పండి. మీకు తెలిసినవాళ్లు డ్రగ్స్‌కు బానిసలైతే టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి. వారు కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది” అని ప్రభాస్ తన వీడియో సందేశంలో తెలిపారు.

కొత్త లుక్:
ఈ వీడియోలో ప్రభాస్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కల్కి 2898 A.D. సినిమాకు భిన్నంగా, పూర్తిగా సన్నబడి స్టైలీష్ లుక్‌లో కనిపించారు.
ప్రస్తుతం డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్’ చిత్రీకరణలో ఉన్న ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి ప్రాజెక్ట్‌లో కూడా భాగమయ్యారు.












