దసరా సినిమాల హడావుడి కాస్త తగ్గి ఇప్పుడు దీపావళి సినిమాల హడావుడి మొదలు ఐంది. ఈ మధ్య కాలంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిన్న సినిమా పొట్టెల్. సందీప్ రెడ్డి వంగ కూడ ఈ సినిమా గురించి గొప్పగా చెప్పారు అంటే ఈ సినిమాలో ఎదో విషయం ఉంది అని ప్రేక్షకులకు అర్ధం ఐంది. యువ చంద్ర, అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రం ప్రీమియర్ రెండు రోజుల ముందు వేశారు. ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే
1970 మరియు 1980 లలో జరుగుతుంది. కథ విదర్భ (మహారాష్ట్ర మరియు తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో) గురంగట్టు గ్రామంలో జరుగుతుంది. ఆ ఊరి గ్రామ దేవత బాలమ్మ కి పుష్కరానికి ఒక సారి సామూహిక పూజలు, జాతర నిర్వహించి పొట్టెల్ ను బలి ఇవ్వాలి. ఈ సమయంలో ఆ ఉరి పటేల్కి గ్రామా దేవత పూనుతుందని ప్రజలు నమ్ముతారు. ఇలా తరతరాలుగా పటేల్ కుటుంబానికి గ్రామా దేవత ఐన బాలమ్మ పూనుతుంది. అయితే పటేల్ (అజయ్)కి బాలమ్మ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. కానీ బాలమ్మ అతనికి పునదు. కానీ పటేల్ మాత్రం తనకు బాలమ్మ పూనినట్టు నాటకాలు ఆడతారు. ఈ విషయం తెలిసిన పొట్టెల్ కాపలాదారు గంగాధర్ (యువ చంద్ర) ఇదే విషయాన్ని ప్రజలకు చెప్పినా వారు నమ్మరు. పటేల్ గ్రామంలోని బలహీనులను ఎదగనివ్వడు. బాలమ్మ రూపంలో రాక్షస స్వభావాన్ని పూనకం రూపంలో చూపిస్తాడు. ఈ ఊరిలో ఎవరిని చదువుకోనివ్వడు. ఈ నేపథ్యంలో ఆ పటేల్ కి వ్యతిరేకంగా గంగాధర్ తన కుమార్తెకు చదువు నేర్పించమని గ్రామ ఉపాధ్యాయుడు దుర్యోధన్ (శ్రీకాంత్ అయ్యంగార్)ని అడుగుతాడు. ఈ విషయం తెలుసుకున్న పటేల్ గంగాధర్ దగ్గర ఉన్న పొట్టేలును మాయం చేస్తాడు. గ్రామస్తులంతా గంగాధర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. జాతర టైమ్ వరకు పొట్టెల్ లోపు పొట్టెల్ ను తీసుకోని రావాలని గంగాధర్ ను గ్రామం నుంచి వేలివేస్తారు. పోటేల్‌తో తిరిగి రాకపోతే తన కూతుర్ని బలి చేస్తానని పటేల్ ఆర్డర్ వేస్తారు. ఈ పొట్టెల్ కోసం గంగాధర్ చేసిన ప్రయత్నాలు ఏమిటి? ఈ విధంగా గ్రామస్తులకు ఎదురైనా పరిణామాలు ఏంటి? ఈ ప్రయాణంలో గంగాధర్ భార్య బుజ్జమ్మ (అనన్య నాగళ్ల) పాత్ర ఏంటి? పటేల్ ఆగడాలకు అడ్డు కట్ట వేసేది ఎవరు? చివరకు ఏం జరుగుతుంది? అన్నది మిగతా కథ.
ఎలా ఉంది ?
బలమైన పాత్రలు మరియు నిజ జీవితం ఆధారంగా ఒక కథాంశం ద్వారా సామాజిక సమస్యను హైలైట్ చేయడంలో ఈ సినిమా సక్సె ఐంది. కేవలం వినోదాన్ని పంచే సినిమాలు మాత్రమే ఉన్న ఈ కాలంలో పొట్టేలు లాంటి సినిమా చేయడం అభినందనీయం. పోటెల్ యొక్క ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే అది ఇప్పటికీ సమాజంలోని కొన్ని వర్గాల్లో లోతుగా పాతుకుపోయిన కులం సమస్యను పరిష్కరించే విధానం. విద్య అనేది వ్యక్తికి సంబంధించినది కాదు, సమాజం మరియు వ్యవస్థకు సంబంధించినది అనే ముఖ్యమైన సందేశాన్ని పొట్టెల్ చిత్రం ద్వారా అందించడం అభినందనీయం. మొత్తం మీద సినిమా చూసే ప్రేక్షకులను ఒక సామజిక న్యాయంతో కూడిన విభిన్నమైన సినిమా చూసిన అనుభూతి అయితే కలుగుతుంది.
ఎవరు ఎలా చేశారు అంటే?
ముఖ్యంగా ఈ చిత్రంలో మనం మాట్లాడుకోవాల్సింది పొట్టెల్ గురించి. సినిమాలో మెయిన్ హీరో పొట్టెల్ ను అనుకోవచ్చు.
మంచి నటుడికి ఆకర్షణీయమైన పాత్రలు లభిస్తాయనడానికి ‘పొట్టెల్’ చిత్రంలో పటేల్ పాత్రలో అజయ్ నటనే ఉదాహరణ. ధ్రువ సినిమాలో అరవింద స్వామి తరువాత అజయ్ పటేల్ అనే పాత్రలో అత్యంత తెలివైన విలన్‌గా జీవించారు అని చెప్పాలి. ఈ పాత్ర యొక్క తీరు డిజైన్ చేసిన విధానం అద్భుతంగా ఉన్నాయి. మన దర్శకులు అజయ్ లాంటి నటులను సరిగ్గా వాడుకోవడం లేదు, అనవసరంగా ఇతర భాష నటులను విలన్ లను చేస్తున్నారు. యువ చంద్ర నటనలో నిజాయితీ కనిపిస్తుంది. పాత్ర కోసం తనను తాను తీర్చిదిద్దుకున్న విధానం బాగుంది. ముఖ్యంగా కూతురు చదువు కోసం దేనికైనా తెగించే తండ్రిగా అతడి నటన చాలా సహజంగా ఉంది. అనన్య నాగళ్ల మరోసారి సహజమైన పాత్రలో చక్కని నటనతో ఆకట్టుకుంది. ఆమె కట్టు బొట్టు, ఆ ముఖంలోని అమాయకత్వం బుజ్జమ్మ పాత్రకు ప్లస్ అయ్యాయి. మిగత నటీనటులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరి మాట
మనిషి సహనానికి పరీక్ష పెడితే ఎలాంటి పోరాట పటిమ బయటికి వస్తుందో చెప్పే చిత్రం పొట్టెల్