• Home
  • Andhra Pradesh
  • పిఠాపురం అభివృద్ధికి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!
Image

పిఠాపురం అభివృద్ధికి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!

పిఠాపురం అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, పిఠాపురంలో శాంతిభద్రతల పరిరక్షణ, వేసవి కాలం నీటి ఎద్దడి నివారణ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఇకపై ప్రతివారం నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించాలని పవన్ నిర్ణయించుకున్నారు.

పిఠాపురం పోలీసుల పనితీరుపై వచ్చిన కథనాలను ప్రస్తావించిన పవన్, అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలని స్పష్టంగా తెలిపారు. నేరస్తులకు అండగా నిలిచే రాజకీయ నాయకులు, పోలీసులను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. దీంతోపాటు, పిఠాపురంలోని నాలుగు పోలీస్ స్టేషన్ల పరిస్థితులపై ఇంటెలిజెన్స్ నివేదికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

పిఠాపురం అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని అధికారులకు ప్రత్యక్షంగా పరిశీలించాలని పవన్ సూచించారు. ఆయన ఆదేశాలతో, పిఠాపురం పరిధిలో శాంతిభద్రతల సమస్యను ఏపీ డీజీపీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు అర్బన్ డెవలెప్‌మెంట్ అధికారులు ప్రకటించారు.

Releated Posts

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు: ఎండలు, వడగాలులు, వర్షాలతో ప్రజలు అలసట…

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఒక వైపు ఎండ వేడి, ఉక్కబోత ప్రజలను వేధిస్తుండగా, మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో…

ByByVedika TeamMay 10, 2025

ఆంధ్రప్రదేశ్ ఈ-క్యాబినెట్ కీలక నిర్ణయాలు | చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి ప్రణాళికలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన ఈ-క్యాబినెట్ సమావేశంలో పలు అభివృద్ధి చర్యలపై మంత్రి మండలి కీలక నిర్ణయాలు…

ByByVedika TeamMay 9, 2025

పాక్ ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్ దాడి – భారత్ అప్రమత్తం..

భారత్ – పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న క్రమంలో, పాకిస్తాన్ కుతంత్రాలకు భారత సాయుధ దళాలు దిమ్మ తిరిగే మాస్టర్ ప్లాన్స్‌తో సమాధానం…

ByByVedika TeamMay 9, 2025

Leave a Reply