బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ, వచ్చే 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ప్రభావిత జిల్లాలు (ఈ రోజు):
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి.
రేపు వర్షాల అవకాశమున్న జిల్లాలు:
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి.
ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు స్థాయిలో వర్షాలు పడి పిడుగులు కూడా సంభవించే అవకాశం ఉంది.
నిన్న నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు:
- కర్నూలు జిల్లా ఉలిందకొండ: 40.8°C
- ప్రకాశం జిల్లా దరిమడుగు: 40.3°C
- చిత్తూరు జిల్లా తవణంపల్లె: 40.1°C
- కడప జిల్లా అమ్మలమడుగు: 39.9°C
- అల్లూరి జిల్లా ఎర్రంపేట: 38.7°C
- అమరావతి: 38.7°C
తెలంగాణ వాతావరణం:
తెలంగాణలో వాతావరణంలో విభిన్నతలు కొనసాగుతున్నాయి. వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపిన వివరాల ప్రకారం, పగటి సమయంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండగా, రాత్రి వేళ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ వైపు పొడి ఈదురు గాలులు వీస్తున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. హైదరాబాద్‌లో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని పేర్కొన్నారు.