హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లి పేరుతో జరిగిన మోసం కలకలం రేపుతోంది. కోనసీమ జిల్లాకు చెందిన నానీ కుమార్ అనే యువకుడు హైదరాబాద్ యూసుఫ్‌గూడలో ఉంటున్నాడు. పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్న అతనికి తన స్నేహితుడు పసుపులేటి తాతా శ్రీనివాస్ పరిచయం కల్పించాడు. మణికొండకు చెందిన గడ్డం శ్రావణి అనే యువతిని తన బంధువురాలిగా చెప్పి నానికి పరిచయం చేశాడు.

ఆమెతో చాట్‌లు, కాల్స్ కొనసాగుతూ, పెళ్లికి సిద్ధమని నమ్మించేందుకు శ్రావణి ప్రయత్నించింది. అనంతరం తల్లిదండ్రుల అనారోగ్యాన్ని నానీ నుంచి దశలవారీగా రూ.10 లక్షల వరకు డబ్బులు తీసుకుంది. డబ్బులు పంపిన తర్వాత శ్రావణి తాన్నే దూరంగా ఉంచడం ప్రారంభించడంతో నాని మోసపోయినట్టు గ్రహించాడు. శ్రీనివాస్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ కావడంతో నాని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.