విజయవాడలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ గ్రౌండ్లో జరిగిన 35వ బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుస్తకాలు మనుషుల్లో తీసుకువచ్చే పరివర్తన గురించి చెప్పారు. ఈ సందర్భంగా పవన్ తన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘తొలి ప్రేమ’ కోసం తన రెమ్యునరేషన్‌ను కూడా గుర్తుచేసుకున్నారు. ఈ సినిమా 1998లో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. తాను తొలిప్రేమ’ కోసం రూ. 15 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నానని, వెంటనే పుస్తకాలను కొనుగోలు చేయడానికి దుకాణానికి వెళ్లానని తెలిపారు.
పుస్తకాలు ఎప్పుడూ నాకు విలువైన వస్తువులు. నేను పుస్తకాలు కొనుగోలు చేయడానికి దాదాపు లక్ష, అంతకంటే ఎక్కువ ఖర్చు చేశానని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పవన్ తాను పుస్తకాలను చదవకుండా ఉండలేనని, కోటి రూపాయలు ఇచ్చినా పుస్తక సేకరణ చేస్తూనే ఉంటానని, పుస్తకాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఎవరైనా నాదగ్గరున్న పుస్తకం అడిగితే, వారికి ఒక పుస్తకం కొనుక్కోండని చెబుతానని అన్నారు. వర్క్ ఫ్రంట్‌లో పవన్ కళ్యాణ్ మార్చిలో ‘హరి హర వీర మల్లు సినిమాలో కనిపించనున్నారు. ఇది పీరియాడిక్ సాగా యాక్షన్, రొమాన్స్‌తో లోడ్ అయిన సినిమా. ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ తదితర సినిమాలు కూడా పవన్ చేతిలో ఉన్నాయి.