పనీర్ ప్రోటీన్ అధికంగా కలిగి ఉండటంతో కండరాల పెరుగుదల, కణాల పునరుద్ధరణకు సహాయపడుతుంది. 100 గ్రాముల పనీర్‌లో 18 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. శాఖాహారులకు ఇది ఉత్తమమైన ప్రోటీన్ మూలం.

పనీర్‌లో కాల్షియం అధికంగా ఉండటంతో ఎముకల బలహీనత సమస్యలను తగ్గిస్తుంది. పిల్లలు, గర్భిణీలు, వృద్ధులకు పనీర్‌ను ఆహారంలో చేర్చడం ఎంతో మేలు చేస్తుంది.
పనీర్‌లో విటమిన్ B12, విటమిన్ D, విటమిన్ A, ఫాస్ఫరస్, జింక్, సెలీనియం లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి శరీర పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి.
పనీర్‌లో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటంతో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తపోటును నియంత్రించడంలో కూడా ఇది సహాయపడుతుంది.
పనీర్ తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. వ్యాయామం చేసేవారికి, శారీరక శ్రమ చేసేవారికి ఇది మంచి ఆహారం. అలాగే, ఎక్కువసేపు ఆకలి అనిపించకుండా ఉండటానికి సహాయపడుతుంది.

పనీర్ ఎక్కువగా తింటే వచ్చే సమస్యలు
- కొలెస్ట్రాల్ పెరుగుదల – అధికంగా తింటే కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలు రావచ్చు.
- బరువు పెరుగుదల – అధిక కేలరీలు కలిగి ఉండటంతో ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
- జీర్ణ సమస్యలు – కొంతమందికి గ్యాస్, ఉబ్బరం సమస్యలు రావచ్చు.
- అధిక సోడియం – మార్కెట్‌లో లభించే కొన్ని రకాల పనీర్‌లలో అధిక సోడియం ఉండటం వల్ల రక్తపోటు సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది.
- కల్తీ పనీర్ ప్రమాదం – నకిలీ పనీర్‌లో రసాయనాలు ఉండే అవకాశం ఉంటుంది. నాణ్యమైన పనీర్‌ను మాత్రమే వాడాలి.
(NOTE: ఆరోగ్య సమస్యల కోసం వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.)