• Home
  • National
  • భారత ప్రతిదాడి: పాక్ ఎయిర్ బేస్‌లపై భారత వైమానిక దళం దాడులు…!!
Image

భారత ప్రతిదాడి: పాక్ ఎయిర్ బేస్‌లపై భారత వైమానిక దళం దాడులు…!!

పాక్ మళ్లీ భారత సరిహద్దులపై దాడులకు పాల్పడిన నేపథ్యంలో భారత్ కూడా తీవ్ర ప్రతిదాడికి దిగింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ వెల్లడించిన వివరాల ప్రకారం, భారత వైమానిక దళాలు చక్లాలా, మురిద్, రఫీకి, రహీమ్ యార్ ఖాన్ వంటి కీలక పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లపై సమర్థవంతమైన దాడులు చేశాయి. ఈ దాడులతో పాక్ వైమానిక స్థావరాల్లో భారీ నష్టం సంభవించింది.

అదే సమయంలో పాకిస్తాన్ రాజౌరిలో షెల్ దాడి చేయగా, అదనపు జిల్లా అభివృద్ధి కమిషనర్ రాజ్ కుమార్ థాపా ప్రాణాలు కోల్పోయారు. పౌరుల ప్రాణాలు పోవడమే కాక, ఆస్తి నష్టం కూడా సంభవించింది. వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌, కల్నల్‌ సోఫియా ఖురేషి ఈ దాడులపై వివరాలు వెల్లడించారు.

భారత వైమానిక దళం సియాల్‌కోట్, సుక్కూర్, చునియా, పస్రూర్ ప్రాంతాల్లోని పాక్ సైనిక స్థావరాలు, రాడార్ సైట్లు, విమానయాన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. పాకిస్తాన్ మన పౌర ప్రాంతాలు, సైనిక స్థావరాలపై మానవరహిత డ్రోన్లు, క్షిపణులు, ఫైటర్ జెట్‌లను వినియోగించిందని, భారత వాయుసేన వాటిని అడ్డుకున్నప్పటికీ, ఉధంపూర్, పఠాన్‌కోట్, అడంపూర్, భుజ్ స్టేషన్లకు కొన్ని నష్టం వాటిల్లిందని తెలిపారు.

పాకిస్తాన్ భారత్‌లో ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసిందని సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తోందని కేంద్రం ఖండించింది. ఫేక్ ఫొటోలు ప్రచారంలో ఉన్నాయని స్పష్టం చేశారు.

Releated Posts

భారత్-పాక్ కాల్పుల విరమణ అనంతరం ప్రధాని మోదీ ప్రసంగం: ఆపరేషన్ సింధూర్ వివరాలు

భారత్‌-పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో సరిహద్దు రాష్ట్రాల్లో శాంతి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ రాత్రి 8…

ByByVedika TeamMay 12, 2025

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

భారత్–పాకిస్తాన్ కాల్పుల విరమణలో తిరుగులేని ఉలుపు – మోదీ గట్టి హెచ్చరికతో పాక్ వెనక్కి…!!

భారత్‌, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై అంగీకారం వచ్చిన రెండు రోజులకు, జమ్మూ కశ్మీర్ సహా అంతర్జాతీయ సరిహద్దుల్లో పరిస్థితి చాలా వరకు ప్రశాంతంగా…

ByByVedika TeamMay 12, 2025

ఐపీఎల్ 2025కి బ్రేక్: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య BCCI కీలక నిర్ణయం…

భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఐపీఎల్ 2025పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్…

ByByVedika TeamMay 9, 2025
1 Comments Text
  • sprunkiocreal says:
    Your comment is awaiting moderation. This is a preview; your comment will be visible after it has been approved.
    That’s a fascinating take on pre-match analysis! It’s cool how Sprunki OC focuses on character-driven stories-adds a whole new layer to creative expression, almost like building a soundtrack for a life! 🤔
  • Leave a Reply