ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 28 మంది అమాయకులు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. ఆర్మీ యూనిఫామ్‌లలో వచ్చిన ఆరుగురు ముష్కరులు, టూరిస్టులను టార్గెట్ చేసి ఘాతుకంగా కాల్చారు. ఈ దాడిలో ఆదిల్ థోకర్ అలియాస్ ఆసిఫ్ షేక్ అనే ఉగ్రవాది ప్రధాన నిందితుడిగా గుర్తించగా, అతడి ఇంటిని సైన్యం ఐఈడీ బాంబులతో పేల్చివేసింది.

ఈ దాడికి పాకిస్తాన్‌లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు సహకరించినట్లు భద్రతా దళాలు వెల్లడించాయి. ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హా అనే మరో ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్‌లు విడుదల చేశారు. వీరి కోడ్ పేర్లు మూసా, యూనస్, ఆసిఫ్.
సేన, CRPF, వాయుసేన బలగాలు బిజ్‌బెహారా, త్రాల్ ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టాయి. బంధీపురా జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగినట్లు సమాచారం. పహల్గామ్ సమీపంలో నెంబర్ ప్లేట్ లేని బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రదాడిపై NIA ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించింది.
ఈ దాడిలో విశాఖపట్నం వాసి చంద్రమౌళి, నెల్లూరు వాసి మధుసూదన్ మరణించడంతో తెలుగు రాష్ట్రాల్లో విషాదం నెలకొంది. మృతదేహాలను తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పర్యాటక ప్రాంతాల్లో భద్రత కఠినంగా పెంచినట్లు అధికారులు తెలిపారు.