కాశ్మీర్ — భూలోక స్వర్గంగా ప్రసిద్ధి చెందిన ఈ లోయ, తాజా ఉగ్రదాడితో కలవరపాటుకు గురైంది. ప్రపంచంలోనే అందమైన ప్రదేశాల్లో ఒకటిగా భావించబడే పహల్గాం, ఇప్పుడు హింసాత్మక ఘటనల కారణంగా వార్తల్లో నిలిచింది. పచ్చిక బయళ్లు, వెండి కొండల మధ్యన అమర్నాథ్ యాత్రకు ముఖద్వారంగా నిలిచే పహల్గాం, సౌందర్యం మాత్రమే కాదు, ఆధ్యాత్మికతకు కూడా నిలయం.

తాజాగా జరిగిన ఉగ్రదాడి అక్కడి పర్యాటక రంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పక్కా ప్రణాళికతో పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడి, శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసింది. నిఘా వర్గాల అంచనాల ప్రకారం, ఏప్రిల్లోనే ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించి హోటల్స్, రిసార్ట్స్పై గమనించారని తెలిసింది.
అమెరికా ఉపాధ్యక్షుడు భారత్లో, ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఈ దాడిని ఉగ్రవాదులు జరిపారు. అంతర్జాతీయ స్థాయిలో చర్చను కలగజేసేలా పాకిస్తాన్ మద్దతుతో ఈ చర్య జరిగిందన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇలాంటి దాడులు పర్యాటకుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయినప్పటికీ, ప్రపంచ దేశాల మద్దతుతో భారత్ ఉగ్రవాదానికి తగిన బుద్ధి చెప్పే అవకాశం ఉంది.