రోజుకు ఒక ఆపిల్ తింటే డాక్టర్ దూరంగా ఉంటాడు అనే మాట తెలిసిందే. అలాగే, ప్రతిరోజూ ఒక నారింజ పండు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్, మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ పరిశోధన ప్రకారం, నిత్యం ఒక నారింజ తినడం ద్వారా ఒత్తిడి తగ్గి, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తేలింది.

డిప్రెషన్ తగ్గించడంలో సహాయపడుతుంది
హార్వర్డ్ మెడికల్ స్కూల్ & మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ పరిశోధనలో, ప్రతిరోజూ నారింజ పండు తినడం వల్ల డిప్రెషన్ 20% తగ్గుతుందని తేలింది. సిట్రస్ పండ్లు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సెరోటోనిన్, డోపమైన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి.

ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
నారింజలో ఫేకాలిబాక్టీరియం ప్రస్నిట్జి అనే మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు సహాయపడుతుంది. ఇది ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, మానసిక స్థితిని బలపరుస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
సిట్రస్ పండ్లలో విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని బలంగా ఉంచుతాయి.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది
నారింజలో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా పనిచేస్తాయి.

జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది
ఫైబర్ అధికంగా ఉండే నారింజ జీర్ణవ్యవస్థను శుభ్రంగా ఉంచి, మంచిగా పనిచేసేలా సహాయపడుతుంది.
హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకుడు డాక్టర్ రాజ్ మెహతా ఏమంటున్నారు?
“నారింజలో ఉండే పోషకాలు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా పనిచేస్తాయి.”
“నిత్యం సిట్రస్ పండ్లు తీసుకుంటే, ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.”
“విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే సిట్రస్ పండ్లు శరీరానికి అవసరమైన ఆరోగ్యాన్ని అందిస్తాయి.”
ముఖ్యమైన సూచన:
ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉంటే, నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.