టాలీవుడ్ ప్రేక్షకుల ప్రియమైన హీరోయిన్ నిత్యా మీనన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నిత్యా, తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ప్రస్తుతం తమిళ చిత్రాల్లో మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంది.
తాజాగా కాదలిక్క నేరమిల్లై సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న నిత్యా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “సినీరంగం అంటే నాకు ఇష్టం లేదు. ప్రశాంత జీవితం కావాలని అనుకున్నా. వేరే రంగంలో ప్రయత్నించాలని భావించాను. కానీ నాకు దక్కిన జాతీయ అవార్డు నా ఆలోచనలను పూర్తిగా మార్చేసింది. ఇది నా జీవితానికి కొత్త దిశ ఇచ్చింది” అని తెలిపింది.
ఇటీవల ప్రమోషన్లలో పాల్గొన్న ఆమె తీరుపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. పీఆర్ఓకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నటుడు జయం రవిని హగ్ చేయడం, దర్శకుడు మిస్కిన్ బుగ్గపై ముద్దు పెట్టడం నెటిజన్ల మధ్య విమర్శలు, మద్దతు తెచ్చిపెట్టాయి.