యంగ్ హీరో నితిన్ తన కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు. భీష్మ సినిమా తర్వాత నితిన్‌కి పెద్ద హిట్ రాలేదు. అయితే, ఇప్పుడు రాబిన్ హుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, క్రికెటర్ డేవిడ్ వార్నర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ రోజు గ్రాండ్‌గా విడుదలవుతున్న రాబిన్ హుడ్ ప్రీమియర్ షోస్ ఇప్పటికే మొదలవ్వడంతో, ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ముఖ్యంగా నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ మళ్లీ మంచి కామెడీని తెరపై చూపించిందని అంటున్నారు. భీష్మ సినిమా తరహాలోనే ఈ సినిమా కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్‌తో నవ్వులు పూయిస్తుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. నితిన్ మరోసారి బ్లాక్‌బస్టర్ కొట్టాడనే టాక్ రాగా, నితిన్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కాంబో అయితే బాగా నవ్వించిందని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తం మీద, రాబిన్ హుడ్ సినిమా నితిన్‌కి కావాల్సిన హిట్‌ను అందిస్తుందా? అనేది చూడాలి!