టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ తాజా చిత్రం రాబిన్ హుడ్ మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నితిన్ సరసన శ్రీలీల నటిస్తోంది. ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. ఇక కేతిక శర్మ ఓ స్పెషల్ సాంగ్‌లో అలరించనుంది.

ఈ నేపథ్యంలో నితిన్ సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు మరో టాలీవుడ్ నటుడు ఆది పినిశెట్టి. అయితే, ఆయన తన ట్వీట్‌లో ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు.
గత ట్వీట్‌కు లేట్ గా రిప్లై – నెట్టింట వైరల్!
గత నెలలో ఆది పినిశెట్టి హీరోగా నటించిన శబ్దం సినిమా విడుదలైంది. ఈ సినిమా ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా విడుదల సమయంలో నితిన్, ఆది పినిశెట్టి & శబ్దం మూవీ యూనిట్‌కు సోషల్ మీడియా ద్వారా ఆల్ ది బెస్ట్ చెప్పారు. అయితే, ఆ సమయంలో తన సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్న ఆది నితిన్ చేసిన ట్వీట్‌కు రిప్లై ఇవ్వలేకపోయాడట.
ఇప్పుడే ఆ విషయంలో స్పందించిన ఆది పినిశెట్టి, రాబిన్ హుడ్ సినిమా విడుదలను పురస్కరించుకుని నితిన్‌కు సారీ చెబుతూ ఓ ట్వీట్ చేశాడు.
ఆది పినిశెట్టి ట్వీట్:
“ఇంత లేట్ అయినందుకు సారీ నితిన్! శబ్దం రిలీజ్ టైమ్‌లో కొన్ని ఇష్యూస్ వల్ల నేను సరిగ్గా రిప్లై ఇవ్వలేకపోయాను. ఇప్పుడు లేట్ అయినా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే రాబిన్ హుడ్ మూవీకి నా శుభాకాంక్షలు!”
ప్రస్తుతం ఆది పినిశెట్టి చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.