నిధి అగర్వాల్ పేరు టాలీవుడ్ లో ఇప్పుడు మారుమ్రోగుతోంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పటికీ తన గ్లామర్‌తో పాపులారిటీ సాధించింది, కానీ పెద్ద హిట్ మాత్రం పడలేదు. నిధి అగర్వాల్ 2018లో “సవ్యసాచి” చిత్రంతో అక్కినేని నాగచైతన్య సరసన టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ సినిమా ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. ఆ తర్వాత అక్కినేని అఖిల్ సరసన “మిస్టర్ మజ్ను” చిత్రంలో నటించింది, కానీ ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.

ఆ తరువాత, తన గ్లామర్‌తో హిట్ అందుకున్న చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. రామ్ పోతినేని సరసన నటించిన ఈ చిత్రం ద్వారా ఆమె టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందింది. నిధి తన నటనతోపాటు అందంతో కుర్రకారును ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా తర్వాత ఆమెకు మరెక్కడా అదే స్థాయిలో అవకాశాలు రాలేదు. అందుకే తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లినా అక్కడ కూడా అదృష్టం కలిసి రాలేదు.
ఇప్పుడు నిధి అగర్వాల్ టాలీవుడ్‌లో రెండు భారీ సినిమాలతో దూసుకుపోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన “హరిహరవీరమల్లు” సినిమా చేస్తోంది. అలాగే ప్రభాస్ సరసన “రాజా సాబ్” సినిమాలో నటిస్తోంది. ఇటీవల ఒక నెటిజన్, శ్రీలీలను నిధితో పోల్చుతూ “ఇస్మార్ట్ శంకర్” తర్వాత నిధి ఏం చేసింది? అని వ్యాఖ్యానించాడు. దానికి నిధి అగర్వాల్ స్పందిస్తూ, “హీరో మూవీ, 3 తమిళ సినిమాలు చేసి, ఇంకా మంచి స్క్రిప్టుల కోసం టైమ్ తీసుకుంటున్నాను. నాకు ఏమీ తొందర లేదు” అని కాస్త ముద్దుగా తన అభిప్రాయాన్ని ప్రకటించింది.