బుధవారం సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ నాయకులతో సమావేశమైన మంత్రి నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త చెప్పారు. రాబోయే రెండు నెలల్లో అన్నదాత సుఖీభవ మరియు తల్లికి వందనం పథకాలను అమలు చేస్తామని ప్రకటించారు. సీఎం చంద్రబాబు 75 ఏళ్ల వయసులోనూ రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఆయనకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన లోకేష్, పాక్‌ను ఎదుర్కొనే ప్రధానమంత్రి మోదీకి తమ కూటమి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. “మన కోరికలు నెరవేరిస్తున్న ప్రధాని మోదీ” అని ప్రశంసించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకున్నమని, అమరావతి నిర్మాణం విషయంలో కేంద్రం సహకరిస్తోందని గుర్తుచేశారు.
గత పదినెలల్లోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని లోకేష్ తెలిపారు. వృద్ధులకు రూ.4000, వికలాంగులకు రూ.6000, రోగులకు రూ.15000 పెన్షన్ అందిస్తున్నామని చెప్పారు. త్వరలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ, జూన్‌లో కొత్త పెన్షన్ దరఖాస్తులు, జులైలో పంపిణీ ప్రారంభం అవుతుందని వివరించారు.
అంజిరెడ్డి, తోట చంద్రయ్య వంటి కార్యకర్తలే తనకు స్ఫూర్తి అని చెప్పారు. కార్యకర్తలే పార్టీకి బలం అన్నారు. పవన్ కళ్యాణ్ ప్రతి ఇంటికి తాగునీరు అందించే కృషి చేస్తున్నారని తెలిపారు.