• Home
  • Entertainment
  • నాని హిట్ 3 మూవీ రివ్యూ….మాస్ హైప్‌తో ముగిసిన థ్రిల్లర్!
Image

నాని హిట్ 3 మూవీ రివ్యూ….మాస్ హైప్‌తో ముగిసిన థ్రిల్లర్!

నాని హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ 3 మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందనలు పొందుతోంది. ఈ చిత్రం పూర్తి స్థాయి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌గా నిలిచింది. మొదటి భాగం ఎక్కువగా విచారణ సీన్లు, బోల్డ్ డైలాగ్స్‌తో సాగుతుందట. కొన్ని సీన్లు బాగున్నప్పటికీ ఫస్ట్ హాఫ్ యావరేజ్ అనిపించిందని ప్రేక్షకుల అభిప్రాయం.

సెకండ్ హాఫ్‌లో కథ మెల్లగా ఊపందుకుంటుందని, ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుండి మంచి గ్రిప్ వస్తుందట. ఓ సర్‌ప్రైజ్ కేమియో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిందని, దాంతో సినిమా ఉత్సాహంగా మారిందని అంటున్నారు. నానికి జోడిగా నటించిన శ్రీనిధి శెట్టి నటన సగటుగా ఉంటే, నాని పెర్ఫార్మెన్స్ మాత్రం సినిమాకు ప్రాణంగా మారిందని అభిప్రాయం. కారెక్టర్ డెవలప్‌మెంట్, మాస్ మూమెంట్స్ సినిమాకు బలంగా నిలిచాయి.

అయితే, సంగీతం సినిమాకు ప్లస్ కాకపోవడం, పాటలు కథలో వేగాన్ని తగ్గించడమే మైనస్ పాయింట్లుగా చెబుతున్నారు. అలాగే రైటింగ్‌లో కొంత ఊహించదగిన స్క్రీన్‌ప్లే ఉండడం వల్ల ట్విస్టులు పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేదని అంటున్నారు. అయినప్పటికీ, మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్, సినిమాటోగ్రఫీ, అద్భుతమైన యాక్షన్ ఎలిమెంట్స్ సినిమాను నిలబెట్టాయి. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, హిట్ 3 బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా మంచి వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి.

Releated Posts

ఈడీ నోటీసులు.. మహేష్ బాబు విచారణకు హాజరవుతారా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్,…

ByByVedika TeamMay 12, 2025

విజయ్ కుమారుడు.. అఖిల్‌తో కలిసిన ఫోటో వైరల్! భారీ ప్రాజెక్ట్‌పై ఊహాగానాలు…!!

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే…

ByByVedika TeamMay 10, 2025

సమంత “న్యూ బిగినింగ్స్” ఫొటోల వెనుక రహస్యం: రాజ్‌ నిడిమోరుతో సంబంధం?

సమంత ఇటీవల “న్యూ బిగినింగ్స్” అనే క్యాప్షన్‌తో పలు ఫొటోలు షేర్ చేయగా, అందులో దర్శకుడు రాజ్‌ నిడిమోరు కనిపించడంతో నెటిజన్ల దృష్టి అక్కడికి…

ByByVedika TeamMay 9, 2025

రజనీకాంత్ ‘కూలీ’ పారితోషికం షాకింగ్: 260 కోట్లు రెమ్యునరేషన్.. నాగార్జున, ఆమిర్ ఖాన్‌కి ఎంతంటే?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న ‘కూలీ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ డైరెక్టర్…

ByByVedika TeamMay 8, 2025

Leave a Reply