అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా సమంతతో విడాకుల తర్వాత ఈ హీరోకు సంబంధించిన ప్రతీది నెట్టింట తెగ హల్‌చల్ అవుతోంది. ప్రస్తుతం తండేల్ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న నాగచైతన్యకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నాగచైతన్య భార్య శోభిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రేర్ ఫొటోను షేర్ చేసింది. దీన్ని చూసిన అభిమానులు ‘‘నాగచైతన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!’’ అంటూ ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయానికి వస్తే, సమంతతో విడాకుల అనంతరం చైతూ, శోభిత ప్రేమలో ఉన్నారంటూ అనేక రూమర్స్ వచ్చాయి. చివరకు వాటిని నిజం చేస్తూ 2024 డిసెంబర్‌లో నాగచైతన్య, శోభిత రెండో వివాహం చేసుకున్నారు.

వీరి పెళ్లి అనంతరం చైతూ నటించిన తండేల్ సినిమా విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. దీంతో ‘‘శోభిత అడుగు పెట్టిన వేళా చైతూ సూపర్ హిట్ అందుకున్నాడు!’’ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. శోభిత పెళ్లి తర్వాత చైతూ గురించి ఎప్పుడూ ఫోటోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.
ఇప్పుడీ క్రమంలోనే ఆమె నాగచైతన్య డీజే ప్లే చేస్తున్న ఓ రేర్ పిక్‌ను షేర్ చేసింది. ఇందులో చైతూ స్వెటర్ వేసుకొని, డీజే ప్లే చేస్తూ స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. దీనిని చూసిన అభిమానులు ‘‘చైతూ డీజే టాలెంట్ కూడా ఉందా!’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.