ఎట్టకేలకు అక్కినేని నాగచైతన్య తాజా సినిమా తండేల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా లెవల్లో డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైంది. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

తండేల్ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా నాగచైతన్య, సాయి పల్లవి అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించడంతో పాటు, సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఫలితంగా, బాక్సాఫీస్ వద్ద మరింత మంచి వసూళ్లు నమోదు చేసే అవకాశముంది. సినిమా విడుదలకు ముందు, నాగచైతన్య, సాయి పల్లవి, చందు మొండేటి కలిసి విస్తృతంగా ప్రమోషన్స్ నిర్వహించారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య, తన మొదటి వివాహం, విడాకుల గురించి మరోసారి స్పందించారు. సమంతతో విడాకులు తీసుకునే ముందు వంద సార్లు ఆలోచించామని, అది ఎంతో గౌరవంగా జరిగిన ప్రక్రియ అని తెలిపారు.
“మేము విడాకుల ప్రకటనను గౌరవంగా చేశాం. మాకు ప్రైవసీ కావాలని కోరుకున్నాం. కానీ అది ఎంటర్టైన్మెంట్ న్యూస్‌గా మారిపోయింది. బ్రేకప్ అనుభవించిన వారికే తెలుసు, అది ఎంత బాధ కలిగిస్తుందో. నేను కూడా ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. మేము ఈ నిర్ణయం ఓవర్‌నైట్‌లో తీసుకోలేదు. వేల సార్లు ఆలోచించాం. పరస్పర అంగీకారంతోనే విడిపోయాం. ఇప్పుడు ఎవరి జీవితాలు వాళ్లు చూసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి రావడం మన చేతిలో ఉండదు. కానీ వచ్చినప్పుడు, దానికి ఓ కారణం ఉంటుంది. నా గురించి ఆలోచించకుండా, మీ జీవితాన్ని అందంగా గడపండి” అని చెప్పుకొచ్చారు నాగచైతన్య.
తండేల్ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన చైతూ, మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.