సినీ పరిశ్రమలో ఒక కథ మరో హీరోకి వెళ్ళడం సాధారణమే. కానీ కొన్నిసార్లు అది ఒకరి కెరీర్‌ను మలుపు తిప్పే విధంగా మారిపోతుంది. అలాంటి సినిమానే “ఎవడు”. ఈ చిత్రం మొదటగా సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం డిజైన్ చేసినదే. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఆ అవకాశం రామ్ చరణ్ దక్కించుకున్నారు.

వంశీ పైడిపల్లి ఈ సినిమాను మొదటగా మహేష్ బాబుతో తీయాలనుకున్నారు. అయితే అప్పటికే మహేష్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో, ఈ ప్రాజెక్ట్ కోసం రెండేళ్ల సమయం పడుతుందని తెలిసింది. అలాగే అతిథి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకోవాలని భావించినా, తారక్ ఆసక్తి చూపించకపోవడంతో దర్శకుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
దీంతో ఈ అవకాశం రామ్ చరణ్‌కు దక్కింది. అల్లు అర్జున్ అతిథి పాత్రలో కనిపించారు. హీరోయిన్లుగా కాజల్ అగర్వాల్, శ్రుతి హాసన్ మెరిశారు. సినిమాకు మ్యూజిక్ కూడా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా చరణ్ కెరీర్లో మరొక మైలురాయిగా నిలిచింది.
ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళితో తెరకెక్కుతున్న సినిమా కోసం సిద్ధమవుతుండగా, రామ్ చరణ్ ‘పెద్ది’ అనే మల్టీస్టారర్ మూవీలో బిజీగా ఉన్నారు.