లవంగాలు అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఉష్ణం పెరిగి, కిడ్నీ మరియు లివర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. లవంగాలలోని యూజినాల్ అనే రసాయనం శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉన్నప్పటికీ, ఎక్కువ మోతాదులో తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
లవంగాలను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయి తగ్గుతుంది. ఇప్పటికే గ్లూకోజ్ తక్కువగా ఉన్నవారు లవంగాలను తీసుకోవడం మానుకోవడం మంచిది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు లవంగాన్ని అధికంగా వాడకూడదు. లవంగాలను అధికంగా తీసుకోవడం వల్ల కంటి సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

యూజినాల్ను పరిమితంగా తీసుకోవడం ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే తలనొప్పి, కళ్లు తిరగడం, బలహీనత వంటి సమస్యలు తలెత్తవచ్చు. హిమోఫిలియా లాంటి రక్తస్రావ సమస్యలు ఉన్నవారు లవంగాన్ని తీసుకోవడం వల్ల రక్తస్రావం ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంది.
లవంగాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, కడుపు నొప్పి, వాంతులు, అతిసారం వంటి కడుపు సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే, నోటిపూత సమస్య, నోటిలో నొప్పి, వాపు, రక్తస్రావం లాంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొనవచ్చు.