• Home
  • Andhra Pradesh
  • లేడీ అఘోరీ వశం: మంగళగిరి విద్యార్థిని అదృశ్యం!
Image

లేడీ అఘోరీ వశం: మంగళగిరి విద్యార్థిని అదృశ్యం!

తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ గురించి తెలియని వారు అరుదు. గతంలో ఆమె పలు ఆలయాలను సందర్శించి వివాదాస్పద చర్యలు చేపట్టి వార్తల్లో నిలిచింది. అయితే, కొంతకాలంగా ఆమె పెద్దగా కనిపించకపోవడంతో మరింత ఆసక్తికరమైన పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి.

తాజాగా, గుంటూరు జిల్లా మంగళగిరిలో ఒక బిటెక్ విద్యార్థిని అఘోరీగా మారేందుకు ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన కలకలం రేపుతోంది. ప్రియదర్శిని కాలేజీలో బిటెక్ చదువుతున్న ఈ యువతి, కొద్దిరోజుల కిందట మంగళగిరికి వచ్చిన లేడీ అఘోరీతో పరిచయం ఏర్పరచుకుంది. ఆ పరిచయం క్రమంగా సాన్నిహిత్యంగా మారింది.

ఈ క్రమంలో, అఘోరీ కొన్ని రోజులు విద్యార్థిని ఇంటిలో బస చేయగా, వారి మధ్య బంధం మరింత బలపడింది. రెండ్రోజుల క్రితం 18 ఏళ్ల ఈ యువతి, తాను అఘోరీగా మారతానని నిర్ణయించుకుని, హైదరాబాద్ వెళుతున్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చింది. తల్లిదండ్రులకు ఇది ఇష్టం లేదని, అందుకే ఇల్లు వదిలి వెళ్లిపోతున్నట్లు తెలిపింది.

అయితే, సోమవారం యువతి తండ్రి కోటయ్య పోలీసులను ఆశ్రయించి తన కుమార్తె అదృశ్యమైందని ఫిర్యాదు చేశాడు. అయితే, ఆమె ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చిన కారణంగా, వారు ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. అయితే, తమ కూతురు లేడీ అఘోరీ వశపడ్డిందని, ఆమె మత్తుమందుల వలన మాయమైందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

తమ కుమార్తెను అఘోరీ కిడ్నాప్ చేసిందని ఆరోపిస్తూ, ఆమెను వెంటనే తమ వద్దకు తీసుకురావాలని తల్లిదండ్రులు పోలీసులను వేడుకుంటున్నారు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Releated Posts

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు: ఎండలు, వడగాలులు, వర్షాలతో ప్రజలు అలసట…

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఒక వైపు ఎండ వేడి, ఉక్కబోత ప్రజలను వేధిస్తుండగా, మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో…

ByByVedika TeamMay 10, 2025

ఆంధ్రప్రదేశ్ ఈ-క్యాబినెట్ కీలక నిర్ణయాలు | చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి ప్రణాళికలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన ఈ-క్యాబినెట్ సమావేశంలో పలు అభివృద్ధి చర్యలపై మంత్రి మండలి కీలక నిర్ణయాలు…

ByByVedika TeamMay 9, 2025

పాక్ ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్ దాడి – భారత్ అప్రమత్తం..

భారత్ – పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న క్రమంలో, పాకిస్తాన్ కుతంత్రాలకు భారత సాయుధ దళాలు దిమ్మ తిరిగే మాస్టర్ ప్లాన్స్‌తో సమాధానం…

ByByVedika TeamMay 9, 2025

Leave a Reply