Vedika Media

Vedika Media

vedika logo

కేంద్రం ఏమి చేస్తుంది? కేటిఆర్

హైదరాబాద్ : బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటిఆర్ సోమవారం ఢిల్లీ వెళ్లారు. కొంత మంది పార్టీ ప్రతినిదులతో కలిసి రాష్ట్రంలో అమృత్ 2.ఓ టెండర్లలో జరిగిన అవినీతిపై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ ను కలిసి పిర్యాదు చేశారు. ఇందులో బాగంగా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన 8 వేల 888 కోట్ల పనులపై విచారణ జరిపించాలని కోరారు. అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. సోమవారం రాత్రి అక్కడే బస చేసి మంగళవారం ఉదయం జాతీయ మీడియాతో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతారు అని పార్టీ వర్గాలు తెలిపాయి. KTR Press Meet in Delhi

KTR press meet

మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంత అవినీతి జరుగుతున్న కేంద్రం ఏమి చేస్తుంది అని మండిపడ్డారు. అమృత్ టెండర్లలో జరిగిన అవినీతిని ఆధారాలతో సహ ఇస్తుంటే ఏందుకు విచారణ జరిపించట్లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకా కేటిఆర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడి ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటిఎం లాగా మారిందని చెప్పారు అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇదే కనుక నిజం అయితే కాంగ్రెస్ పార్టీపై ఏందుకు చర్యలు తీసుకోవట్లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆర్ ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారు అని, ఆ డబ్బులను రేవంత్ రెడ్డి తీసుకొని రాహుల్ గాంధీకి ఇస్తున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు కేటిఆర్. సిఎం బావమరిది సృజన్ రెడ్డిని సంతృప్తి పరచడానికి ఈ టెండర్ ను ఏకపక్షంగా ఇచ్చేశారు అని ఆరోపణలు చేశారు. ఈ టెండర్లలో బాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీకి కూడ ఆ పథకానికి సంబంధించిన పనులు కట్టపెట్టేశారు అని ఎద్దేవా చేశారు. ఈ విధంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు.

కేసుల మాఫీ కోసమే ఢిల్లీ వెళ్లారు : మంత్రి కోమటిరెడ్డి 

కేటిఆర్ తనపై ఉన్న కేసుల మాఫీ కోసమే ఢిల్లీ వెళ్లారు అని మంత్రి కోమటిరెడ్డి ఆరోపణలు చేశారు. అమృత్ టెండర్లలో స్కామ్ లేదు అని చెప్పారు. సిఎం రేవంత్ రెడ్డికి సృజన్ రెడ్డి తోకచుట్టం అవుతారు అని చెప్పారు. అంతే కాకుండా కవితతో కలిసి సృజన్ రెడ్డి అనేక కాంట్రాక్ట్ పనులు చేశారు అని గుర్తు చేశారు.  

Leave a Comment

Vedika Media