వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురవ్వడంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు తీవ్రమైన గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తిందని, ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని సమాచారం. మంగళవారం రాత్రి ఆయన గ్యాస్ట్రిక్ సమస్యలతో ఆస్పత్రికి వెళ్లగా, వైద్యులు పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు.

అయితే, కొడాలి నానికి గుండెపోటు వచ్చిందన్న ప్రచారాన్ని ఆయన టీమ్ ఖండించింది. గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు స్పష్టతనిచ్చారు. ఈ పరిణామంతో పార్టీ నేతలు, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేస్తున్నారు.














