భారత క్రికెట్ స్టార్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి గత ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మార్చి 24న వీరిద్దరికీ ఓ పండంటి ఆడపిల్ల జన్మించింది. ఈ రోజు (ఏప్రిల్ 18) రాహుల్ 33వ పుట్టిన రోజు సందర్భంగా, తన కుమార్తెకు “ఇవారా” (Evaarah) అనే అద్భుతమైన పేరును పెట్టారు. ఇది “దేవుని బహుమతి” అనే అర్థాన్ని ఇస్తుందని తెలిపారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో రాహుల్ షేర్ చేసిన ఫోటోలో, అతియాతో కలిసి తన పాపను కౌగిలించుకొని ఉన్న తీయని క్షణాన్ని అభిమానులతో పంచుకున్నారు. “మా పాప, మా సర్వస్వం. ఇవారా – దేవుడిచ్చిన వరం” అని క్యాప్షన్ రాశారు. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు.