నటి ఖుషి కపూర్ తన వివాహ ప్రణాళికల గురించి తాజాగా సిద్ధార్థ్ కన్నన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. చిన్నతనం నుంచి ఓ గ్రాండ్ వెడ్డింగ్ గురించి కలలు కంటున్నట్లు వెల్లడించారు. అయితే, తన చెల్లి జాన్వి కపూర్ కలలతో పోల్చితే, ఆమె భావన పూర్తిగా భిన్నంగా ఉందని చెప్పారు.
ఖుషి మాట్లాడుతూ, “తాను తిరుపతిలో ఉంటూ, తలలో మొగళి పువ్వులు పెట్టుకొని, తన భర్తకి సేవ చేసుకుంటూ, పిల్లలు అరటిపత్రం మీద భోజనం చేస్తూ ఉండాలని జాన్వి చెబుతుందని” హాస్యంగా వివరించారు.

బాంబేలో పుట్టిపెరిగిన ఖుషి వివాహంపై చిన్నప్పటి నుంచే ఆసక్తి చూపుతుందని చెప్పారు. చిన్నప్పుడు స్నేహితులతో కలిసి వివాహానికి సంబంధించిన ఆటలతో మెలకువలు పొందినట్లు గుర్తు చేసుకున్నారు.
తన వివాహం తర్వాత తండ్రి బోనీ కపూర్ కూడా అదే బిల్డింగ్‌లో తన భర్తతో కలిసి ఉండాలని భావించినట్లు ఖుషి తెలిపారు. భర్త, ఇద్దరు పిల్లలు, అనేక కుక్కలతో జీవించాలనేది తన కల అని అన్నారు.