కల్వకుంట్ల కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) ఐదో సోదరి సకలమ్మ అనారోగ్య సమస్యల కారణంగా తుదిశ్వాస విడిచారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సకలమ్మ శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో కన్నుమూశారు. ఆమె వయసు సుమారు 85 సంవత్సరాలు.
కుటుంబ సభ్యుల ప్రకారం, సకలమ్మ గత కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ వార్త తెలుసుకున్న వెంటనే కేసీఆర్‌తో పాటు కుటుంబ సభ్యులు ఆమె ఇంటికి వెళ్లారు. కేసీఆర్ తన తోబుట్టువులతో ప్రేమతో ఉండడం ప్రత్యేకత. ప్రతి రాఖీ పండుగకు తన సోదరీమణుల చేత రాఖీ కట్టించుకునే ఆచారం ఆయనలో ఉంది.

కేసీఆర్‌కు మొత్తం ఎనిమిది మంది అక్కలు, ఒక అన్న, ఒక చెల్లి ఉన్నారు. వారిలో కొందరు కాలం చేశారు. ఈ పరిస్థితుల్లో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.