సరిగ్గా దీపావళి పండగకి వారం ముందు మంత్రి పొంగులేటి మరియు మీడియా ప్రతినిధుల బృందం సౌత్ కొరియా లో నదిని పరిశీలించడానికి వెళ్ళింది. ఆ టైమ్ లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ దీపావళి పండగలోపు బాంబులు పేలబోతున్నాయి అంటు మీడియాతో చెప్పారు. అంటే పండగ లోపు తప్పు చేసిన వారిని అరెస్ట్ చేస్తాము అంటు హింట్ ఇచ్చారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియాలో ktr అరెస్ట్ అంటు వార్తలు వచ్చాయి. ఈ ఫార్ములా రేస్ లో నిధులు దారి మల్లిచ్చినట్టు ఏసీబీ కేసు నమోదు చేసింది. అప్పటి డైరెక్టర్ అరవింద్ ను విచారించగా అప్పటి మినిస్టర్ KTR చెప్పినట్టు నేను చేశాను అని విచారణలో చెప్పారు. దింతో ktr అరెస్ట్ తప్పదు అంటు దాదాపు వారం రోజుల పాటు ట్రెండ్ చేశారు. అయితే పండగ అయిపోయింది. కానీ ktrను అరెస్ట్ ఇంతవరకు చేయలేదు. KCR Arrest Soon
మీడియాలో జరుగుతున్న హడావుడిని గమనించిన మాజీ మంత్రి ktr మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు ఈ ఫార్ములా రేస్ అంటే ఏంటి? దీని వెనుక ప్రధాన ఉద్దేశ్యం ఏంటి ? ఫార్ములా రేస్ కండక్ట్ చేయడం వల్ల హైదరాబాద్ వంటి మహానగరానికి ఎలాంటి పెట్టుబడులు వచ్చాయో సవివరంగా వివరించారు. అంతే కాదు నేనే ఆ 55 కోట్లు విడుదల చేయమని చెప్పాను ఎం చేసుకుంటారో చేసుకోండి అంటు సవాల్ విసిరారు. ఒక వేళ అరెస్ట్ చేస్తే జైలు కి వెళ్లి స్లిమ్ అయి ఆ తరువాత పాదయాత్ర చేస్తాను అంటు చెప్పారు.
ఎవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది
ఎందుకో కానీ ktr ప్రెస్ మీట్ పెట్టిన తరువాత అరెస్ట్ చేస్తే సింపతీ మొత్తం BRS పార్టీకి వెళ్తుంది అనే భావన పార్టీ వర్గాల్లో కలిగింది. దీనికి తోడు లీగల్ సెల్ వారు కూడ ఈ కేసు కోర్ట్ లో నిలబడదు అనే విషయాన్ని కూడ చెప్పినట్టు తెలుస్తుంది. దీనికి తోడు ఈ సారి ఫార్ములా వన్ రేస్ చెన్నై సిటీలో జరుగుతుంది. అక్కడ కూడ ప్రభుత్వం నిధులు డైరెక్ట్ గా విడుదల చేసింది. ఈ విషయాన్ని కూడ ktr ప్రెస్ మీట్ లో ప్రస్తావించారు. దింతో ఈ అంశం కాస్త పక్కదారి పట్టినట్టు అంత భావించారు. కాని మంత్రి పొంగులేటి ఈ సారి మరో పెద్ద ఆటంబాంబు పేల్చారు. ఇక్కడితో అయిపోలేదని కథ ఇంకా మిగిలే ఉందనే సంకేతాలు ఇచ్చారు.
దింతో BRS పార్టీ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. ఈ సారి ఎవరిపై బాంబు పడుతుందో తెలియని పరిస్థితి వచ్చింది. అయితే పొలిటికల్ అనలిస్టులు అంచనా ప్రకారం ఈ సారి విధ్యుత్ కొనుగోలు కేసు లో మాజీ సీఎం కెసిఆర్ ను అరెస్ట్ చేస్తారు అనే వార్త చక్కర్లు కొడుతోంది. కెసిఆర్ తో పాటు మాజీ విధ్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిని కూడ అరెస్ట్ చేస్తారు అంటు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాలు గమనించిన BRS పార్టీ క్యాడర్ అలెర్ట్ అయినట్టు తెలుస్తుంది. అంతే కాదు పార్టీ లీగల్ సెల్ ను కూడ అప్రమత్తం చేశారు. అందుకే హైదరాబాద్ సిటీ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం ర్యాలీలకు, నిరసనలకు అనుమతి లేదు అని ఆంక్షలు పెట్టారు. ఏ క్షణంలో అయిన ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.