• Home
  • Games
  • కావ్య మారన్ ఖర్చు చేసిన రూ.39.25 కోట్లు వృథా? వరుస ఫెయిల్స్‌తో నిరాశపరిస్తున్న SRH బ్యాటర్లు!
Image

కావ్య మారన్ ఖర్చు చేసిన రూ.39.25 కోట్లు వృథా? వరుస ఫెయిల్స్‌తో నిరాశపరిస్తున్న SRH బ్యాటర్లు!

ఐపీఎల్ అంటే ఫ్యాన్స్‌కి మోజు మాత్రమే కాదు, యజమానులకు పెద్ద పెట్టుబడి గేమ్. జట్టును గెలిపించేందుకు ఫ్రాంచైజీలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటాయి. అలానే సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ కూడా జట్టులో నమ్మకమైన ఆటగాళ్ల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. కానీ ఆ పెట్టుబడి ఇప్పుడు నష్టంగా మారిందన్న చర్చ జోరుగా నడుస్తోంది.

ఈ సీజన్‌కి ముందు SRH గత సీజన్‌లో ఫైనల్‌కి చేరింది. టీమ్ ప్రదర్శనపై అభిమానులు, యాజమాన్యం భయాందోళనలతో పాటు ఆశలు కూడా పెట్టుకున్నారు. ముఖ్యంగా జట్టు బ్యాటింగ్ లైనప్ మీదే ఎక్కువ నమ్మకం ఉండింది. అందుకే, SRH యాజమాన్యం మూడు స్టార్ ఆటగాళ్లను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మను చెరో రూ.14 కోట్లకు రిటైన్ చేయగా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్‌ను వేలంలో రూ.11.25 కోట్లకు దక్కించుకుంది. మొత్తం కలిపితే రూ.39.25 కోట్లు ఖర్చు అయింది. కానీ మొదటి మ్యాచ్ మినహా, ఈ ముగ్గురు ఆటగాళ్లు ఆ తర్వాతి నాలుగు మ్యాచ్‌ల్లో పూర్తిగా విఫలమయ్యారు.

ప్రథమ మ్యాచ్‌లో SRH 286 పరుగుల భారీ స్కోరు చేయడంలో హెడ్ (67), ఇషాన్ (106), అభిషేక్ (24) కీలక పాత్ర పోషించారు. కానీ ఆ మ్యాచ తర్వాత హెడ్ కేవలం 81 పరుగులు, అభిషేక్ 27 పరుగులు, ఇషాన్ కిషన్ 21 పరుగులు మాత్రమే చేశారు. ఈ వరుస ఫెయిల్యూర్స్‌తో జట్టు బ్యాటింగ్ యూనిట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ముగ్గురిపై పెట్టిన భారీ డబ్బు వృథా అయిందని అభిమానులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. కావ్య మారన్ పెట్టుబడికి లాభం లేనట్టే కనిపిస్తోంది. టోర్నీలో మిగిలిన మ్యాచ్లలో వీరు ఫామ్‌లోకి వస్తే తప్ప, SRH ఫైనల్ ఆశలు సుదూరమేనని విశ్లేషకులు అంటున్నారు.

Releated Posts

ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ ఓవర్‌లో విజయం – నాలుగేళ్ల తర్వాత IPL‌లో థ్రిల్లింగ్ మ్యాచ్‌..!!

ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది.…

ByByVedika TeamApr 17, 2025

విడాకులు.. ఎఫైర్ రూమర్స్.. చివరికి అతనో కొత్త కథ రాశాడుగా!

ఐపీఎల్ 2025లో ఏప్రిల్ 15న అద్భుతమైన పరిణామం చోటు చేసుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అతి తక్కువ స్కోర్‌ను…

ByByVedika TeamApr 16, 2025

“హిట్ మ్యాన్ వారసుడి బుగ్గలు చూశారా? అచ్చం రోహిత్ లానే ఉన్నాడుగా!”

ఇండియన్ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ తన కుటుంబంతో కలిసి ఇటీవల పబ్లిక్‌లో కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ…

ByByVedika TeamApr 16, 2025

కావ్య మారన్‌పై భువనేశ్వర్ కుమార్ చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

భువనేశ్వర్ కుమార్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 11 సీజన్లు ఆడిన భువి, ప్రస్తుతం ఆర్‌సీబీ…

ByByVedika TeamApr 15, 2025

Leave a Reply