భువనేశ్వర్ కుమార్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 11 సీజన్లు ఆడిన భువి, ప్రస్తుతం ఆర్‌సీబీ జట్టుతో ఐపీఎల్ 2025లో బరిలోకి దిగాడు. అయితే, ఓ పాత ఇంటర్వ్యూలో జట్టు ఓనర్ కావ్య మారన్ గురించి చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

“నేను సన్‌రైజర్స్ కోసం 11 సీజన్లు ఆడా. ఇప్పుడు ఆర్‌సీబీ తరఫున ఆడటం చాలా కొత్త అనిపిస్తోంది. కానీ నా హృదయంలో సన్‌రైజర్స్ ఎప్పుడూ ఉంటుంది,” అని భావోద్వేగంగా చెప్పారు భువనేశ్వర్ కుమార్. ముఖ్యంగా కావ్య మారన్ గురించి మాట్లాడుతూ, “ఆమె చాలా మంచి వ్యక్తి. ఆమె ఎన్నడూ ఓ ఆటగాడిని తప్పుపట్టలేదు. జట్టు ఓనర్‌గా ఆమె ఎంతో పెట్టుబడి పెట్టారు, అయినా ఓటముల సమయంలో కూడా మాకు మద్దతుగా నిలిచారు,” అని చెప్పాడు.

కావ్య మారన్ ఐపీఎల్ 2016 నుంచి జట్టు వ్యవహారాలు చూసేస్తున్నారు. ఆమె ప్రోత్సాహంతో చాలా మంది ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో ఆడేలా మారారు. ముంబై, చెన్నై వంటి పెద్ద జట్ల మధ్య SRH అనే చిన్న ఫ్రాంచైజీ నిలదొక్కుకునేలా చేసిన నాయకత్వం కావ్యదే. ఆమె ప్లేయర్లకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. ఏ పరాజయమైనా ఓనర్‌గా ఆమె మౌనంగా ఓర్పుగా అంగీకరించింది. ఇదే కారణంగా ఆటగాళ్లు ఆమెను గౌరవంగా చూస్తున్నారు.
ప్రస్తుతం ఐపీఎల్ 2025లో SRH 6 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించింది. వరుసగా 4 పరాజయాల అనంతరం పంజాబ్ కింగ్స్‌పై విజయం నమోదు చేసింది. ఇప్పుడతే SRH గురువారం ముంబై ఇండియన్స్‌తో కీలక పోరుకు సిద్ధమవుతోంది. జట్టు పునరాగమనం ఆశాజనకంగా కనిపిస్తున్న సమయంలో, భువనేశ్వర్ కామెంట్స్ ఫ్యాన్స్‌లో జాతీయ స్థాయిలో ఆసక్తిని కలిగిస్తున్నాయి.