• Home
  • Andhra Pradesh
  • జేఈఈ మెయిన్ 2025 తుది ఫలితాలు ఇవాళ విడుదల – ర్యాంకులు, కటాఫ్‌ వివరాలు ఇదిగో…!!
Image

జేఈఈ మెయిన్ 2025 తుది ఫలితాలు ఇవాళ విడుదల – ర్యాంకులు, కటాఫ్‌ వివరాలు ఇదిగో…!!

హైదరాబాద్, ఏప్రిల్ 17:
జేఈఈ మెయిన్ 2025 తుది విడత ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ రోజు (ఏప్రిల్ 17) విడుదల చేయనుంది. ఈ సంవత్సరం జనవరిలో మొదటి విడత పరీక్షలు నిర్వహించగా, ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు తుది విడత పరీక్షలు జరిగాయి. ఇందులో ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో బీఈ/బీటెక్‌కు సంబంధించిన పేపర్-1 పరీక్షలు జరిగాయి. అలాగే ఏప్రిల్ 9న బీఆర్క్‌/బీ ప్లానింగ్‌కు సంబంధించిన పేపర్ 2ఏ, 2బీ పరీక్షలు నిర్వహించారు.

ఈ రెండు విడతలలో విద్యార్థులు సాధించిన ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులు కేటాయించనున్నారు. ఇక ప్రాథమిక ఆన్సర్ కీపై అభ్యంతరాల గడువు ఏప్రిల్ 13 (ఆదివారం అర్ధరాత్రి)తో ముగియగా, వాటిని నిపుణుల కమిటీ పరిశీలించింది. ఈ నేపథ్యంలో తుది ఆన్సర్ కీతో పాటు ర్యాంకులను కూడా నేడు ప్రకటించనున్నారు.

కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులను ప్రకటిస్తారు. నిపుణుల అంచనాల ప్రకారం కటాఫ్ రేంజ్‌లు ఇలా ఉండొచ్చు:

  • జనరల్ కేటగిరీ: 93%-95%
  • ఓబీసీ/ఈడబ్ల్యూఎస్: 91%-93%
  • ఎస్సీ కేటగిరీ: 82%-86%
  • ఎస్టీ కేటగిరీ: 73%-80%

ఈ విడత ఫలితాలతో దేశవ్యాప్తంగా 2.50 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించనున్నట్లు ప్రకటిస్తారు. అంటే మే 18న జరగనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు వీరే అర్హులు అవుతారు.

ఎన్‌టీఏ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది – తుది ఆన్సర్ కీ వచ్చే వరకు ప్రొవిజినల్ కీలో ఉన్న సమాధానాల ఆధారంగా ఎటువంటి నిర్ణయం తీసుకోరాదని సూచించింది. ఎందుకంటే కొన్ని ప్రశ్నలపై విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిగణనలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియలో విద్యార్థులకు అదనంగా మార్కులు కలసే అవకాశముంది.

తుది కీతో పాటు ర్యాంకులనూ ఈరోజే విడుదల చేయనున్నందున విద్యార్థులు ఉత్కంఠగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

Releated Posts

హైదరాబాద్‌లో సోనాటా సాఫ్ట్‌వేర్ కొత్త ఫెసిలిటీ ప్రారంభం – CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌ నగరం మరోసారి ఐటీ రంగంలో తన హవాను చాటుకుంది. నానక్‌రామ్‌గూడలో సోనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ కొత్తగా ఏర్పాటు చేసిన ఫెసిలిటీ సెంటర్‌ను సీఎం…

ByByVedika TeamMay 12, 2025

భారత్-పాక్ కాల్పుల విరమణ అనంతరం ప్రధాని మోదీ ప్రసంగం: ఆపరేషన్ సింధూర్ వివరాలు

భారత్‌-పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో సరిహద్దు రాష్ట్రాల్లో శాంతి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ రాత్రి 8…

ByByVedika TeamMay 12, 2025

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలంగాణలో వడగండ్ల వర్షాల హెచ్చరిక – 26 జిల్లాలకు ఎల్లో అలెర్ట్

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం సోమవారం (మే 12), మంగళవారం (మే 13) మధ్య తెలంగాణ రాష్ట్రంలో వడగండ్ల వర్షాలు…

ByByVedika TeamMay 12, 2025

Leave a Reply