• Home
  • International
  • అంతరిక్షంలో బేస్‌బాల్‌! వైరల్‌ అవుతున్న జపాన్‌ వ్యోమగామి కోయిచి వకట వీడియో…!!
Image

అంతరిక్షంలో బేస్‌బాల్‌! వైరల్‌ అవుతున్న జపాన్‌ వ్యోమగామి కోయిచి వకట వీడియో…!!

అంతరిక్ష వార్తలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఇటీవల వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బుల్‌ విల్మోర్‌ ఐఎస్‌ఎస్‌లో చిక్కుకున్న విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వారం రోజుల మిషన్‌ కోసం వెళ్లిన వారు మొత్తం తొమ్మిది నెలలు అక్కడే ఉండిపోయారు. చివరకు భూమికి తిరిగి చేరుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ సందర్భంలో, వ్యోమగాములు అంతరిక్షంలో ఎలా జీవిస్తారు? ఏం తింటారు? ఎలా నిద్రపోతారు? వంటి ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి.

ఈ క్రమంలో, జపాన్‌కు చెందిన వ్యోమగామి కోయిచి వకాటా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో బేస్‌బాల్‌ ఆడిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ వీడియోను స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ కూడా ఎక్స్‌ (Twitter) లో షేర్‌ చేశారు.

కోయిచి వకాటా జీరో గ్రావిటీని వినియోగించుకుని ఐఎస్‌ఎస్‌లో ఒంటరిగా బేస్‌బాల్‌ ఆడారు. తానే బాల్‌ విసిరి, తానే బ్యాట్‌తో కొట్టిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో విపరీతంగా పాపులర్‌ అయ్యాయి. ఈ వీడియోను షేర్‌ చేస్తూ కోయిచి, “ఇది బేస్‌బాల్‌ సీజన్‌. మేజర్‌ లీగ్‌ బేస్‌బాల్‌ సీజన్‌ జపాన్‌లో ప్రారంభమవుతోంది. ఎక్స్‌పెడిషన్‌ 68 సమయంలో ఐఎస్ఎస్‌లో బేస్‌బాల్‌ ఆడాను. జీరో గ్రావిటీలో ఈ ఆట ఆడేందుకు జట్టుతో పని లేదు” అని కామెంట్‌ చేశారు.

దాదాపు 20 ఏళ్ల పాటు వ్యోమగామిగా పనిచేసిన కోయిచి వకాటా, 2024లో జపాన్‌ ఏరోస్పేస్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ఏజెన్సీ (JAXA) నుంచి రిటైర్‌ అయ్యారు. ఐదుసార్లు ఐఎస్ఎస్‌కు వెళ్లిన ఆయన మొత్తం 500 రోజులు అంతరిక్షంలో గడిపారు. అంతేకాదు, ఎక్స్‌పెడిషన్‌ 39 సమయంలో ఐఎస్‌ఎస్‌ కమాండర్‌గా పనిచేసిన తొలి జపనీస్‌ వ్యోమగామిగా రికార్డు సాధించారు. ఇప్పుడు ఆయన అంతరిక్షంలో బేస్‌బాల్‌ ఆడిన వీడియో నెట్టింట ట్రెండింగ్‌గా మారింది.

Releated Posts

పసిడి పరుగులు: గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా – ఈ ఏడాది చివరికి రూ.1.25 లక్షలు!

పసిడి పరుగులు పెడుతోంది. కేవలం మూడు అడుగుల దూరంలో లక్ష రూపాయల మార్కు కనిపిస్తోంది. ‘గోల్డ్‌ రేట్లు తగ్గుతాయి’ అని భావించినవారి అంచనాలను బంగారం…

ByByVedika TeamApr 16, 2025

అమెరికాపై చైనా ప్రతీకారం.. డ్రాగన్ నుండి భారీ సుంకాల దెబ్బ!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పదవీకాలంలో ప్రపంచ దేశాలపై టారిఫ్‌లు (సుంకాలు) విధిస్తూ వాణిజ్య యుద్ధానికి నాంది పలికారు. అమెరికా దేశ…

ByByVedika TeamApr 9, 2025

సుంకాల షాక్‌! ట్రంప్ నిర్ణయాలతో పెట్టుబడిదారుల కాళ్లు వణికిపోతున్నాయి!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న సుంకాల నిర్ణయాలు గ్లోబల్‌ స్టాక్‌మార్కెట్లను కుదిపేశాయి. మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుతున్నా ట్రంప్ మాత్రం లైట్ తీసుకుంటున్నారు.…

ByByVedika TeamApr 7, 2025

“Sunita Williams: మరొకసారి అంతరిక్షంలోకి, సునీతా విలియమ్స్‌ ఐఎస్ఎస్‌కు ఎప్పుడు వెళతారు?”

అంతరిక్షంలో చిక్కుకుని, తొమ్మిది నెలల తర్వాత భూమికి తిరిగొచ్చిన సునీతా విలియమ్స్‌, తన ధీరతను, సాహసాన్ని ప్రపంచానికి చాటుకున్నారు. శాస్త్ర పరిశోధనల కోసం మళ్లీ…

ByByVedika TeamApr 1, 2025

Leave a Reply