Vedika Media

Vedika Media

vedika logo

జై హనుమాన్ సినిమాలో రిషబ్ శెట్టి తో పాటు మరో తెలుగు హీరో….. 

ఈ సంవత్సరం సంక్రాంతి పండగ సందర్బంగా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అయన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. భారీ సినిమాలు పోటీలో ఉన్న కూడ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు ఒక్క సారిగా ట్రేండింగ్ లో వచ్చింది. తెలుగు మరియు హిందీ భాషల్లో ఈ సినిమాకు భారీగా కలెక్షన్స్ వచ్చాయి. ఈ ఒక్క సినిమాతో హీరో తేజ సజ్జ కి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. అయితే హనుమాన్ సినిమా ఎండింగ్ లోనే జై హనుమాన్ సినిమాపై హింట్ ఇచ్చారు దర్శకుడు. Jai Hanuman Movie Update

Jai Hanuman Movie Update

ఇప్పుడు జై హనుమాన్ సినిమా పట్టాలపైకి వెళ్లే సమయం ఆసన్నమైంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమాను హనుమాన్ నిర్మాతలు నిర్మించవలసి ఉంది. కానీ బడ్జెట్ ఇష్యూ వల్ల మైత్రి మూవీ మేకర్స్ రంగంలోకి దిగింది. అయితే ఈ సినిమాలో హనుమంతునిగా కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన రిషబ్ శెట్టి ఫస్ట్ లుక్ కి విశేష స్పందన వచ్చింది. కాంతారా సినిమాతో ఇండియన్ వైడ్ గా రిషబ్ శెట్టి బాగా పాపులర్ అయ్యారు. హనుమంతుని లుక్ కి మరియు పర్సనాలిటీ కి రిషబ్ శెట్టి అయితేనే పర్ఫెక్ట్ మ్యాచ్ అని దర్శకుడు అనుకున్నారు. 

జై హనుమాన్ సినిమాలో కనిపించే హీరో ఎవరంటే ? 

ఈ సారి జై హనుమాన్ సినిమాలో హనుమంతుని వీరత్వం చూపించబోతున్నారు. అయితే ఈ సినిమాలో రానా కూడ కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. రానా ఈ సినిమాలో ఏదైనా ముఖ్య పాత్రలో చేస్తున్నారా ? లేకపోతే విలన్ రోల్ చేస్తున్నారా ? అనే విషయాలు తెలియాల్సి ఉంది.  ఒక వేళ విలన్ గా చేస్తే మాత్రం ఈ సినిమాపై భారీ హైప్ వచ్చే అవకాశం ఉంది. అయితే పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగవలసిందే. 

Leave a Comment

Vedika Media