జగిత్యాల, జనవరి 16:
సోషల్ మీడియాలో అక్రమంగా మహిళల ఫొటోలు ఎడిట్ చేసి అశ్లీలంగా షేర్ చేస్తున్న వ్యక్తి జగిత్యాలలో పోలీసులకు పట్టుబడ్డాడు. బుగ్గారం మండలం గోపాల్ పూర్కు చెందిన బండారి శ్రవణ్, పబ్లిక్ ప్లేసుల్లో తిరుగుతూ మహిళల ఫొటోలు తీసి, వాటిని ‘థైస్ అండ్ లెగ్స్’ అనే పేరుతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేస్తున్నాడు.
ఈ సంఘటనపై పోలీసులు సాంకేతిక ఆధారాలతో కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు. 11వ తేదీన పోలీసులు ఫిర్యాదు అందుకున్న తర్వాత, శ్రవణ్ అక్రమంగా ఫోటోలు తీసి, ఎడిట్ చేసి వాటిని పోస్ట్ చేసినట్లు గుర్తించారు.

మహిళలకు సంబంధించిన ఈ అసభ్యకర ఫొటోలు, నిందితుడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో బ్లాక్ చేయించినట్లు డీఎస్పీ రఘు చందర్ తెలిపారు. ఈ ఘటన పై పోలీసులు ప్రజలకు సున్నితమైన సైబర్ దాడులపై మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఇలాంటి సైకోల కారణంగా అనేక మంది అమ్మాయిలు భయాందోళనలకు గురవుతున్నారని చెప్పారు. ప్రజలు తమ చుట్టుపక్కన ఏ చిన్న అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం అందించాలన్నారు.