డిజే టిల్లు, టిల్లు స్క్వేర్ లాంటి సూపర్ హిట్స్ తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ “జాక్” అనే స్పై థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. బొమ్మరిల్లు భాస్కర్ usual love tracks నుంచి బయటపడుతూ సీరియస్ జానర్‌లోకి వచ్చిన ప్రయత్నం ఇది.

కథ: జాక్ (సిద్ధూ) చిన్ననాటి నుంచే రా ఏజెంట్ కావాలనే కలలతో ఎదుగుతాడు. దేశానికి ముప్పు తగలడంతో ముందుగానే రంగంలోకి దిగిపోతాడు. అదే సమయంలో టెర్రరిస్ట్ నుజీఫర్ రెహమాన్ (రాహుల్ దేవ్) ఇండియాపై దాడి ప్లాన్ చేస్తాడు. రా అధికారి మనోజ్ (ప్రకాశ్ రాజ్) చురుగ్గా పని చేస్తుంటే, జాక్ హఠాత్‌గా ఆ ప్లాన్‌ను డిస్టర్బ్ చేస్తాడు. మధ్యలో భానుమతి (వైష్ణవి చైతన్య) అనుకోకుండా జాక్ జీవితం మీద డబ్బింగ్ చెప్పడం మొదలెడుతుంది.
ప్లస్ పాయింట్స్:
- సిద్ధూ usual స్టైల్ & ఎనర్జీ
- రిచ్ సినిమాటోగ్రఫీ
- కొన్ని కామెడీ ఎలిమెంట్స్
మైనస్ పాయింట్స్:
- రొటీన్ కథ
- బేసిక్ స్క్రీన్‌ప్లే
- లోతులేని ఎమోషన్లు
- స్పై థ్రిల్లర్‌గా లాజిక్ మిస్
నిర్ణయం:
సిద్ధూ usual ఎనర్జీతో ప్రయత్నించాడుగానీ, బొమ్మరిల్లు భాస్కర్ రొటీన్ కథను స్పై బ్యాక్‌డ్రాప్‌లో వేయడమే తప్పిపోయింది. టెక్నికల్ వర్క్ బాగున్నా, కథలో కొత్తదనం లేకపోవడం సినిమా స్థాయిని తగ్గించింది.