పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి, భారత్, పాకిస్తాన్ను సోదర దేశాలుగా అభివర్ణిస్తూ, శతాబ్దాల నాటి సాంస్కృతిక, నాగరికత సంబంధాలను గుర్తు చేశారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఇరాన్ రెండు దేశాలతో సంప్రదింపులు జరిపి, ఉద్రిక్తతలను తగ్గించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.

అరఘ్చి, 13వ శతాబ్దపు ప్రసిద్ధ పర్షియన్ కవి సాది షిరాజీ రచించిన “బని ఆడమ్” కవితలోని మాటలను ప్రస్తావిస్తూ, మానవులు అంతా ఒకే మూలం నుంచి వచ్చారని, ఒకరి బాధను మిగతావారు కూడా అనుభవించాల్సిన అవసరముందని గుర్తు చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ పాత్ర కీలకంగా మారనుంది. భారత్, పాకిస్తాన్ మధ్య శాంతి స్థాపనకు మద్దతుగా ఇరాన్ చేస్తున్న ఈ ప్రయత్నం అంతర్జాతీయంగా గమనించదగినది.