ఐపీఎల్ 2025లో ఏప్రిల్ 15న అద్భుతమైన పరిణామం చోటు చేసుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అతి తక్కువ స్కోర్‌ను డిఫెండ్ చేస్తూ సంచలనం సృష్టించింది. కేవలం 111 పరుగులు చేసిన పంజాబ్.. ఈ స్కోరును కాపాడుకుని, కేకేఆర్‌ను 16 పరుగుల తేడాతో ఓడించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ విజయానికి కారణం యుజ్వేంద్ర చాహల్ ఇచ్చిన అద్భుత ప్రదర్శన. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బౌలర్లలో ఒకరైన చాహల్.. ఈ మ్యాచ్‌లో తన మాంత్రిక బౌలింగ్‌తో పంజాబ్‌కు అద్బుత విజయం అందించాడు. 4 ఓవర్లు వేసి కేవలం 28 పరుగులే ఇచ్చి 4 కీలక వికెట్లు తీశాడు. మొదట రహానేను ఔట్ చేయడం ద్వారా మ్యాచ్ వాస్తవంగా మలుపు తిరిగింది. ఆపై అంగ్క్రిష్, రింకూ, రమణదీప్‌లను ఔట్ చేసి మ్యాచ్‌ను పంజాబ్ పక్కకు తిప్పేశాడు.
చాహల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించగా, పంజాబ్ యజమాని ప్రీతి జింటా అతనిపై ప్రశంసల వర్షం కురిపించింది. అంతే కాదు, చాహల్‌ను కౌగిలించుకుని ప్రత్యేకంగా గిఫ్ట్ కూడా ఇచ్చిందట!
చాహల్‌ను రూ. 18 కోట్లకు తీసుకున్న పంజాబ్ నిర్ణయం నిజంగా సార్ధకం అయింది. ఇప్పుడే కాదు.. ఐపీఎల్ చరిత్రలో అతను 4 సార్లు పర్పుల్ క్యాప్ గెలిచిన రికార్డు కలిగిన ఏకైక ఆటగాడు. ఇప్పుడు అతని ప్రదర్శనకు ఫ్యాన్స్‌తో పాటు యజమాన్యం కూడా మైమరచిపోతోంది.